AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లో విషాదం.. గంట వ్యవధిలోనే మూడు రోడ్డు ప్రమాదాలు, నలుగురు మృతి

హైదరాబాద్ నగరంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ఉదయం పూట కేవలం మూడు గంటల వ్యవధిలోనే మూడు రోడ్డు ప్రమాదాలు జరగడం కలకలం రేపింది. ఈ మూడు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. ట్యాంక్‌బండ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎవరికి ప్రమాదం జరగలేదు.

Hyderabad: హైదరాబాద్‌లో విషాదం.. గంట వ్యవధిలోనే మూడు రోడ్డు ప్రమాదాలు, నలుగురు మృతి
Road Accident
Aravind B
|

Updated on: Jul 30, 2023 | 11:35 AM

Share

హైదరాబాద్ జులై 30: హైదరాబాద్ నగరంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ఉదయం పూట కేవలం మూడు గంటల వ్యవధిలోనే మూడు రోడ్డు ప్రమాదాలు జరగడం కలకలం రేపింది. ఈ మూడు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. ట్యాంక్‌బండ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎవరికి ప్రమాదం జరగలేదు. కానీ కారు మాత్రం పూర్తిగా దెబ్బతింది. ట్యాంకు‌బండ్ పై ఉన్న డివైడర్‌ను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే కారులో ఉన్న సెఫ్టీ బెలూన్స్ తెరుచుకోవడం వల్లే అందులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ తర్వాత వారు కారు దిగి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కారు అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లాలోని ఆరాంఘర్ వద్ద ఓ బైక్ అదుపుతప్పి విద్యుత్ స్థంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. అలాగే కుషాయిగూడలోని ఓ కారు డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కూడా ఇద్దరు మరణించారు. అయితే ఈ ప్రమాదాలు వాహనాలు వేగంగా నడపడమే కారణమే పోలీసులు భావిస్తున్నారు. దీంతోపాటు మద్యం మత్తులో కూడా కారుని నడిపి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే ఈ మూడు రోడ్డు ప్రమాదాలపై సంబంధిత పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ప్రమాదాల నివారణకు పోలీసులు , అధికారులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్న ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Follow Us