AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonia Gandhi: రాహుల్‌ గాంధీకి పెళ్లి చేద్దామా.? మహిళా రైతు ప్రశ్నకు సోనియా సమాధానం ఏంటంటే..

ఢిల్లీలో సోనియా నివాసానికి హర్యానాకు చెందిన మహిళా రైతులు వచ్చినప్పుడు ఆసక్తికరమైన ఘటన జరిగింది. మహిళా రైతులకు విందు ఇచ్చారు సోనియాగాంధీ. రాహుల్‌గాంధీ పెళ్లి చేస్తే బాగుంటుంది కదా… అని ఓ మహిళా రైతు సోనియాను ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ ఇంకా ఎన్నాళ్లు ఒంటరిగా ఉంటారని , పెళ్లి చేయాలని సూచించారు ఆ మహిళా రైతు. అయితే ఈ ప్రశ్నకు సోనియా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. అమ్మాయిని చూడండి.. వెంటనే పెళ్లి చేద్దామని చెప్పుకొచ్చారు...

Sonia Gandhi: రాహుల్‌ గాంధీకి పెళ్లి చేద్దామా.? మహిళా రైతు ప్రశ్నకు సోనియా సమాధానం ఏంటంటే..
Rahul Gandhi Sonia Gandhi
Narender Vaitla
|

Updated on: Jul 29, 2023 | 10:31 PM

Share

రాహుల్‌కు పెళ్లి చేద్దామా ? ఎప్పుడు చేద్దాం.. అంటూ హర్యానాకు చెందిన ఓ మహిళా రైతు సోనియాతో ముచ్చట్లు చెప్పడం హాట్‌టాపిక్‌గా మారింది. మీరే అమ్మాయిని చూడండి.. పెళ్లి చేద్దాం.. అంటూ సోనియా సమాధానం ఇవ్వడం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. భారత్‌ జోడో యాత్ర తరువాత కూడా ప్రజలతో మమేకం అవుతున్నారు రాహుల్‌గాంధీ. కొద్దిరోజుల క్రితం రాహుల్‌గాంధీ హర్యానాలో పర్యటించిన సమయంలో.. సోనీపత్‌ జిల్లా మదీనా గ్రామ మహిళా రైతులు ఢిల్లీకి రావాలని ఉందని చెప్పారు. దీంతో రాహుల్‌ వాళ్లను సోనియా నివాసానికి ఆహ్వానించారు. హర్యానా నుంచి వచ్చిన ఆ మహిళలు ముందుగా ఢిల్లీ లోని పలు ప్రాంతాలను సందర్శించారు. తరువాత 10 జన్‌పథ్‌లోని సోనియా నివాసానికి చేరుకున్నారు.

ఢిల్లీలో సోనియా నివాసానికి హర్యానాకు చెందిన మహిళా రైతులు వచ్చినప్పుడు ఆసక్తికరమైన ఘటన జరిగింది. మహిళా రైతులకు విందు ఇచ్చారు సోనియాగాంధీ. రాహుల్‌గాంధీ పెళ్లి చేస్తే బాగుంటుంది కదా… అని ఓ మహిళా రైతు సోనియాను ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ ఇంకా ఎన్నాళ్లు ఒంటరిగా ఉంటారని , పెళ్లి చేయాలని సూచించారు ఆ మహిళా రైతు. అయితే ఈ ప్రశ్నకు సోనియా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. అమ్మాయిని చూడండి.. వెంటనే పెళ్లి చేద్దామని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

హర్యానా మహిళలను గాంధీ కుటుంబం సాదరంగా ఆహ్వానించింది. వారికి ప్రత్యేక ఆతిథ్యం ఏర్పాటు చేయడమే గాక.. సోనియా, ప్రియాంక , రాహుల్‌ గాంధీ కూడా మహిళలతో కలిసి భోజనం చేశారు. ఓ మహిళ సోనియా గాంధీ చెవిలో.. ‘రాహుల్‌కు పెళ్లి చేద్దామా?’ అని అడిగారు. దీనికి ఆమె బదులిస్తూ.. ‘మీరే ఓ మంచి అమ్మాయిని చూడండి’ అని అనడంతో రాహుల్‌ నవ్వుతూ ‘అవుతుంది.. అవుతుంది’ అని చెప్పారు. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ గురించి మహిళలు సోనియాను అడగ్గా ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఆ సమయంలో అమ్మ చాలా కుంగుబాటుకు లోనయ్యారని, కొన్ని రోజుల పాటు అన్నం, నీళ్లు ముట్టలేదని ప్రియాంక చెబుతుండగా సోనియా కన్నీటి పర్యంతమయ్యారు. మహిళా రైతులతో కలిసి సోనియా, ప్రియాంక నృత్యం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఒంటికి చలువ..ఇంటిల్లిపాదికి ఆరోగ్యం!ఈ కూరగాయ బోర్‌ అనకుండా తినాలి
ఒంటికి చలువ..ఇంటిల్లిపాదికి ఆరోగ్యం!ఈ కూరగాయ బోర్‌ అనకుండా తినాలి
గణిత, వైఫై అన్వేషణలకు ఆర్డీవోకు అంతర్జాతీయ గుర్తింపు!
గణిత, వైఫై అన్వేషణలకు ఆర్డీవోకు అంతర్జాతీయ గుర్తింపు!
ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు ప్రపంచ రికార్డ్ బద్దలు..!
ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు ప్రపంచ రికార్డ్ బద్దలు..!
ఐస్‌ వాటర్‌ ఫెషియల్‌ ఇలా చేయడం వల్ల బోలెడు లాభాలు..అందమే అందం!
ఐస్‌ వాటర్‌ ఫెషియల్‌ ఇలా చేయడం వల్ల బోలెడు లాభాలు..అందమే అందం!
24 గంటల్లోనే మరో గాయం.. హార్దిక్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?
24 గంటల్లోనే మరో గాయం.. హార్దిక్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?
కొత్త కార్ కొనాలా? భారీ డిస్కౌంట్లు పొందేందుకు 'బెస్ట్ టైమ్' ఇదే.
కొత్త కార్ కొనాలా? భారీ డిస్కౌంట్లు పొందేందుకు 'బెస్ట్ టైమ్' ఇదే.
బాలనాగమ్మ సినిమా చిత్రీకరణ అయినా ఎందుకు రిలీజ్ కాలేదంటే..?
బాలనాగమ్మ సినిమా చిత్రీకరణ అయినా ఎందుకు రిలీజ్ కాలేదంటే..?
నాటు గుడ్డు.. ఫారం గుడ్డు: ఏది ఆరోగ్యానికి మంచిది? నిపుణుల సూచన
నాటు గుడ్డు.. ఫారం గుడ్డు: ఏది ఆరోగ్యానికి మంచిది? నిపుణుల సూచన
భూమిపై అదే చివరి రోజా.. నవంబర్ 13న ఏం జరగబోతుంది..?
భూమిపై అదే చివరి రోజా.. నవంబర్ 13న ఏం జరగబోతుంది..?
లియోనెల్‌ మెస్సీ నెట్‌వర్త్‌ చూస్తే కళ్లు తిరగాల్సిందే..!
లియోనెల్‌ మెస్సీ నెట్‌వర్త్‌ చూస్తే కళ్లు తిరగాల్సిందే..!