Telangana: బీజేపీలోకి నటి జయసుధ.. ఎక్కడి నుంచి పోటీ చేయబోతునున్నారంటే..?

Telangana BJP: కేసీఆర్ సర్కారును ఓడించడం బీజేపీతోనే సాధ్యమంటున్నారు ఆ పార్టీ జాతీయ నేత‌ తరుణ్ చుగ్‌. రాష్ట్రంలో పార్టీ బలమైన క్యాడర్, పటిష్టమైన నాయకత్వంతో ఉందన్నారాయన. ఇలా తెలంగాణలో అధికారం తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపీ మరోవైపు ‘ఆపరేషన్ ఆకర్ష్’ పేరుతో నేతలను తన గూటికి చేర్చుకుంటోంది. ఈ క్రమంలోనే శనివారం సినీ నటి జయసుధ బీజేపీలోకి..

Telangana: బీజేపీలోకి నటి జయసుధ.. ఎక్కడి నుంచి పోటీ చేయబోతునున్నారంటే..?
Jayasudha And Kishan Reddy
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jul 29, 2023 | 6:09 PM

Telangana BJP: కేసీఆర్ సర్కారును ఓడించడం బీజేపీతోనే సాధ్యమంటున్నారు ఆ పార్టీ జాతీయ నేత‌ తరుణ్ చుగ్‌. రాష్ట్రంలో పార్టీ బలమైన క్యాడర్, పటిష్టమైన నాయకత్వంతో ఉందన్నారాయన. ఇలా తెలంగాణలో అధికారం తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపీ మరోవైపు ‘ఆపరేషన్ ఆకర్ష్’ పేరుతో నేతలను తన గూటికి చేర్చుకుంటోంది. ఈ క్రమంలోనే శనివారం సినీ నటి జయసుధ బీజేపీలోకి రానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని శనివారం కలిసిన ఆమె త్వలోనే కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు ఆమె రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందంటూ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ఇదిలా ఉండగా  బీజేపీ జాతీయ నేత తరుణ్ చుగ్ సమక్షంలో పలువురు ప్రతినిధులు కమలదళంలో చేరారు. ఇలా బీజేపీ కండువా కప్పుకున్నవారిలో మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, జైపాల్ రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు. ఇప్పటికే తెలంగాణపై ఫోకస్ పెంచిన ఢిల్లీలోని కమళనాధులు మరిన్ని చేరికలు ఉండేలా పావులు కదుపుతున్నారు. మరోవైపు అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన 25 ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని, కాషాయ కండువా కప్పుకోవడానికి కేవలం తగిన సమయం కోసం చూస్తున్నారని తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవలే బాంబు పేల్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..