TS Congress: హుజురాబాద్ రిజల్ట్స్ ఎఫెక్ట్.. మాణిక్కం ఠాగూర్‌పై వేటు తప్పదా.? ఇంచార్జ్‌ని ఇంటికి పంపించనున్నారా.?
TS Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో హుజురాబాద్ బైపోల్ రీ సౌండ్ మారు మోగుతూనే ఉంది. ఘోరమైన ఫలితాలపై నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. వరుస ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఒక నేతపై ఫిర్యాదులు..

TS Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో హుజురాబాద్ బైపోల్ రీ సౌండ్ మారు మోగుతూనే ఉంది. ఘోరమైన ఫలితాలపై నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. వరుస ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఒక నేతపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ దూతగా వచ్చిన నేత వైఖరిపై టీ.కాంగ్రెస్ సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారట. ఆ నేతను మాకొద్దని ఫిర్యాదు చేస్తున్నారట. సదరు నేత కూడా తెలంగాణ బాధ్యత నుంచి తప్పుకోవాలని చూస్తున్నారట… ఇంతకీ ఎవరా నేత ఎవరో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. అవును.. ఆనేత మరెవరో కాదు తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూరే.
టీ కాంగ్రెస్‌కు ఇంఛార్జ్‌గా మాణిక్కం ఠాగూర్ వచ్చిన నాటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ షో కనబరుస్తోంది. దీంతో మాణిక్కం ఠాగూర్ పదవికి ఎసరు పడిందా అన్న చర్చ జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్‌కు మాణిక్కం ఇంచార్జ్‌గా వచ్చి రాగానే దుబ్బాక బై ఎలక్షన్ వచ్చింది.. దీంతో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాణిక్కం ఠాగూర్.. నేతలందరినీ దుబ్బాకలో మొహరించి, గ్రామానికో లీడర్ కు భాధ్యతలు అప్పగించారు .. అయినా ఆశించిన ఫలితం రాలేదు , తర్వాత వచ్చిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికలోను అదే పరిస్థితి.. ఈ ఎన్నికల్లో ఠాగూర్ పెద్దగా పట్టించుకోలేదు, ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుందని అందరూ భావించినా ఓటమి తప్పలేదు.
ఇక ఆ తర్వాత వచ్చిన జీహెఎంసీ ఎన్నికల్లో పరిస్థితి మారుతుందని భావించినా ఇక్కడ కూడా అట్టర్ ఫ్లాప్ షో దీంతో ఇంఛార్జ్ గా ఠాగూర్ వచ్చినా పెద్దగా ఫలితాలలో మార్పు లేకపోవడంతో పార్టీ లో ఠాగూర్ పై అసంతృప్తి మొదలయింది.. అడపాదడపా నేతలు ఠాగూర్‌ను విమర్శిస్తూనే ఉన్నారు.. ఇక మొన్న జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో చరిత్రలో ఎన్నడూ లేని ఘోర ఓటమిని ముటగట్టుకుంది కాంగ్రెస్.. దీంతో ఠాగూర్ పై ఇంకా వ్యతిరేకత పెరిగినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది… ఠాకూర్ గాంధీ భవన్ మీటింగ్‌లకు తప్ప గ్రౌండ్ లెవల్‌లో పార్టీ పరిస్థితిని అంచనా వేసి ముందుకు నడిపించడంలో ఫేలవుతున్నారనే చర్చ సీనియర్లలో నడుస్తుందని సమాచారం.
అసలు మణిక్యం ఠాగూర్ అంటే మొదటి నుండి కొంత మంది నాయకులు అయిష్టంగానే పనిచేస్తున్నారు అందులోను కొత్త కార్యవర్గం విషయంలో పెద్ద పాత్ర ఆయనదే అని డబ్బులు తీసుకొని పదవులు ఇచ్చారని కోమటిరెడ్డి, జగ్గారెడ్డి లాంటి నాయకులు బాహాటంగానే విమర్శించారు ఆ తరువాత హై కమండ్ జ్యోకంతో సైలెంట్ అయిపోయారు కానీ ఆయన వచ్చినప్పటి నుంచి ఎక్కడ విజయవంతం కాకపోవడంతో ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు. కొందరు సీనియర్ నాయకులు హైకమాండ్ దగ్గర నేరుగా పిర్యాదుల పర్వం కొనసాగిస్తున్నారని సమాచారం.
దీంతో హై కమండ్ కూడా ఇంచార్జ్ మార్పు పై ఆలోచన చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే చాలా రోజుల నుంచి తమిళనాడు పీసీసీ కోసం మానిక్కం ఠాగూర్ ప్రయత్నాలు చేస్తున్నారని అందుకే తెలంగాణ కాంగ్రెస్ ను పట్టించుకోవడంలేదనే మరో చర్చ కూడా నడుస్తుంది. మొత్తానికి ఏదో చేద్దామని వచ్చిన ఠాగూర్ కు ఇక్కడ పరిస్థితులు చూసి ఇక తమిళనాడుకు వెళ్‌లి పోవడమే బెటర్ అనిపిస్తుందని టాక్.. మరి టీ కాంగ్రెస్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో వేచి చూడాలి.
టీవీ9 రిపోర్టర్ అశోక్ భీమనపల్లి.
Also Read: Viral News: 110 ఏళ్ల తర్వాత తెరచుకున్న భవనం తలుపులు.. లోపల కార్పెట్‌ను చూడగానే ఫ్యూజులు ఔట్..
Puneeth RajKumar: పునీత్ రాజ్ కుమార్‌కు సూర్య నివాళి.. అప్పు సమాధిని చూసి హీరో ఎమోషనల్..