Viral News: 110 ఏళ్ల తర్వాత తెరచుకున్న భవనం తలుపులు.. లోపల కార్పెట్‌ను చూడగానే ఫ్యూజులు ఔట్..
శిధిలావస్థకు దగ్గరగా ఉన్న భవంతులు, పురాతన భవనాలు ఎన్నో తరచూ సేల్‌కు వస్తుంటాయి. అమెరికాలో అయితే ఈ తరహా అమ్మకాలు ఎక్కువగా...
శిధిలావస్థకు దగ్గరగా ఉన్న భవంతులు, పురాతన భవనాలు ఎన్నో తరచూ సేల్‌కు వస్తుంటాయి. అమెరికాలో అయితే ఈ తరహా అమ్మకాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అక్కడ 110 ఏళ్ల నాటి ఓ పురాతన భవనం తక్కువ బడ్జెట్‌లో అమ్మకానికి వస్తే.. ఓ జంట కొనుగోలు చేసింది. ఇక తమ సొంత ఇంటి కల నెరవేరిందన్న సంతోషంతో ఆ జంట దానిని రెనోవేషన్ చేసేందుకు తలుపులు తెరిచారు. హాల్ దాటి ఓ గదిలోకి ఎంటర్ కాగానే వారికి ఓ కార్పెట్ కనిపించింది. దాన్ని చూసిన ఆ జంట ఒక్కసారి ఖంగుతిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ ఇంటిని ఖాళీ చేశారు. వివరాల్లోకి వెళ్తే..
ఉటా రాష్ట్రంలోని లేక్ సిటీలో నివాసముంటున్న ఓ జంట పాత ఇంటిని తక్కువ ధరకు కొనుగోలు చేశారు. దానిని రెనోవేషన్ చేసేందుకు పనులు మొదలుపెట్టగా.. వారికి అక్కడ రక్తపు మరకలతో నిండిన ఓ కార్పెట్ కనిపించింది. అక్కడ ఏదో తప్పు జరిగిందని గ్రహించిన ఆ జంట వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు. ఇక అందుకు సంబంధించిన వీడియోను టిక్‌టాక్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే ఆ ఇల్లు 1911లో నిర్మించబడినది అని పోలీసుల విచారణలో తేలింది. అలాగే కార్పెట్‌పై ఉన్న రక్తపు మరకలు మనిషివా లేక జంతువువా అనే దానిపై దర్యాప్తును కొనసాగిస్తున్నారు. అయితే దంపతులు మాత్రం ఈ భయానక సంఘటన చూసిన వెంటనే ఆ ఇంటిని ఖాళీ చేసేశారు. కాగా, ఈ జంట ఆ దృశ్యాలను టిక్‌టాక్‌లో షేర్ చేయడంతో.. నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు లభిస్తున్నాయి.
Read Also: ఉపకారం మరువని ఉడత… వీడియో చూస్తే మైమరచిపోతారు
ప్రతి ఒక్కరు విమానంలో తినే సదా అవకాశం… ఎయిర్‌క్రాఫ్ట్ రెస్టారెంట్.. ఎక్కడ ఉన్నదో తెలుసా..??