Viral Video: అడవిలో ఉండాల్సిన నల్ల త్రాచు.. మోటర్ షోరూంలోకి వచ్చింది.. పామును చూసిన జనాలు..
Viral Video: ఇటీవలి కాలంలో అడవుల్లో జీవించే వన్యప్రాణులు జనావాసంలోకి రావడం ఎక్కువవుతోంది. అటవీ ప్రాంతం తగ్గడం, వాటికి సరైన ఆహారం దొరకకపోవడం కారణం ఏదైనా.. జనావాసాల్లోకి మూగ జీవులు వస్తున్నాయి. అయితే..
Viral Video: ఇటీవలి కాలంలో అడవుల్లో జీవించే వన్యప్రాణులు జనావాసంలోకి రావడం ఎక్కువవుతోంది. అటవీ ప్రాంతం తగ్గడం, వాటికి సరైన ఆహారం దొరకకపోవడం కారణం ఏదైనా.. జనావాసాల్లోకి మూగ జీవులు వస్తున్నాయి. అయితే దారి తప్పిన వచ్చిన జీవులు ప్రజలకు ఇబ్బంది కలిగించడంతో పాటు తమ ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నాయి. ఇక మరీ ముఖ్యంగా పాములు ఇళ్లలోకి చొరబడుతోన్న సంఘటనలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. స్మార్ట్ ఫోన్‌లు, సోషల్ మీడియాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత పట్టణ బాట పట్టిన పాములకు సంబంధించిన వీడియోలు ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా విశాఖ ఏజెన్సీలోని పాడేరులో ఓ నల్లత్రాచు జనాలను భయాందోళనకు గురిచేసింది. ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కానీ.. ఏకంగా ఓ మోటార్స్ షోరూంలోకి దూరింది. దీంతో షాప్‌లో ఉన్న పనివాళ్లు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. బుసలు కొడుతోన్న 12 అడుగుల నల్లత్రాచు అలా వచ్చేసరికి స్థానికులంతా భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న స్నేక్ క్యాచర్ మోటార్ షోరూంకు చేరుకొని చాకచక్యంగా పామును పట్టుకున్నాడు. అనంతరం దగ్గర్లో ఉన్న అటవీ ప్రాంతంలో వదిలేశారు. దీంతో స్థానికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: Andhra Pradesh: ఉద్యోగుల హాజరుపై ఏపీ సర్కార్ సంచలన ఆదేశాలు.. ఆ నిబంధనలు తప్పనిసరి
PM Narendra Modi-Kedarnath: కేదార్నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలతో సందడి చేసిన పీఎం మోదీ.. (ఫొటోస్)
Ayodhya Ram Temple: అయోధ్య రామాలయ దర్శన భాగ్యం భక్తులకు ఎప్పటి నుంచంటే..?