Andhra Pradesh: ఉద్యోగుల హాజరుపై ఏపీ సర్కార్ సంచలన ఆదేశాలు.. ఆ నిబంధనలు తప్పనిసరి
ప్రభుత్వ ఉద్యోగుల హజరుపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. సచివాలయంలో ఉద్యోగులందరి బయోమెట్రిక్ హజరును తప్పని సరిచేసింది.
ప్రభుత్వ ఉద్యోగుల హజరుపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. సచివాలయంలో ఉద్యోగులందరి బయోమెట్రిక్ హజరును తప్పని సరిచేసింది. ఇప్పటికే బయోమెట్రిక్ హజరుపై సాధారణ పరిపాలన శాఖ మెమో జారీ చేసింది. మరోసారి తాజాగా ఉద్యోగుల బయోమెట్రిక్ హజరుపై జీఎడీ మెమో జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాలు, హెచ్ఓడీలు, జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగుల హాజరు వివరాలను నియంత్రణలోకి తెచ్చుకోవాలని ఏపీ సచివాలయంలో పనిచేస్తున్న కార్యదర్శులకు సూచనలు జారీ చేసింది. బయోమెట్రిక్ ద్వారా నమోదైన ఉద్యోగుల హాజరును ఎప్పటికప్పుడు గమనించాలని అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏపీ సచివాలయంలోని ఉద్యోగుల హాజరు నమోదు వివరాలు రోజువారీగా సంబంధిత శాఖ కార్యదర్శి పరిశీలించాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖ సూచించింది. ఏపీ సచివాలయంలో 10 శాతం మంది ఉద్యోగులు ఉదయం 11 గంటల తర్వాతే విధులకు హాజరవుతున్నట్టు గుర్తించినట్టు ప్రభుత్వం పేర్కొంది.
సచివాలయంలోని అన్ని విభాగాల్లోనూ 80 శాతం హాజరు తప్పనిసరిగా ఉండేలా చూడాలని ఆయా శాఖల కార్యదర్శులను ఆదేశించింది. ఈ అంశంపై గతంలో జారీ చేసిన నిబంధనల్ని తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వం స్ఫష్టం చేసింది. ఉద్యోగ విరమణ చేసిన, బదిలీ అయిన ఉద్యోగులకు సంబంధించిన వివరాలను బయోమెట్రిక్ పరికరాల నుంచి తొలగించాలని సూచించింది. బయోమెట్రిక్ హాజరు నమోదుకు నెలవారీగా నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని.. ప్రతీశాఖ కార్యదర్శి ఉద్యోగుల హాజరును బయోమెట్రిక్ ద్వారా పరిశీలించాలని పేర్కొంది.
Also Read: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Viral Video: చావు మిల్లీమీటర్ దూరంలో ఉంది.. అతడు ఏం చేశాడో మీరే చూడండి