Viral Video: చావు మిల్లీమీటర్ దూరంలో ఉంది.. అతడు ఏం చేశాడో మీరే చూడండి
జంతువులకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. వాటిలో కొన్ని చాలా క్యూట్‌గా ఉన్నాయి. మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయి.

జంతువులకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. వాటిలో కొన్ని చాలా క్యూట్‌గా ఉన్నాయి. మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయి. అయితే పాములు మాత్రమే కాదు సంబంధించిన వీడియోలు కనిపించినా సరే చాలామంది భయపడారు. పాములంటే చాలామందికి కచ్చితంగా మనసులో ఉంటుంది. అలాంటి పాము అనుకోకుండా పాకుతూ ఒడిలోకి చేరితే.. చాలామందికి పై ప్రాణాలు పైనే పోతాయి. చాలా తెలివిగా వ్యవహరిస్తే తప్ప ఇలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకోలేం. ఇప్పుడు ఇంటర్నెట్‌లో అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో ఒక పాము అకస్మాత్తుగా ఒక వ్యక్తి ఒళ్లోకి చేరుకుంది. ఈ క్రమంలో చాలా తెలివిగా వ్యవహరించిన సదరు వ్యక్తి.. పాముకు ఎలాంటి హాని చేయకుండా, తన ప్రాణాలకు ముప్పు లేకుండా తప్పించుకున్నాడు. Watch Video:
OMFG!!! Thought everyone should see this. pic.twitter.com/nNKl3bdsrC
— Jamie Gnuman197… (@Jamie24272184) November 2, 2021
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఆ వ్యక్తి ఒడిలో పాము వచ్చి కూర్చున్నట్లు వీడియోలో చూడవచ్చు. అతడు కదిలి ఒత్తిడి కలిగిస్తే పాము కాటేస్తుంది. ఈ క్రమంలో అతడు తన చేతిలోకి చిన్న కర్రపుల్లను తీసుకుని.. దూరం నుంచి పాము వైపు తీసుకువచ్చాడు. దీంతో ఆ పాము తన ఫోకస్ షిఫ్ట్ చేసి.. అతడు ఒళ్లో నుంచి కిందకు వచ్చింది. అనంతరం మరోసారి దాన్ని కొద్దిగా కదిలించాడు. దీంతో అది అతడి వెనుక నుంచి అక్కడి నుంచి పారిపోయింది. ఇలా మైండ్ కు పదునుపెట్టి అతడు సమయస్ఫూర్తిగా వ్యవహరించాడు. ఈ వీడియోను @Jamie24272184 అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోకి ఇప్పటివరకు వేల సంఖ్యలో వ్యూస్, లైక్‌లు, కామెంట్స్ వచ్చాయి.
Also Read: మరిది పెళ్లిలో వదిన సూపర్ డ్యాన్స్.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే
అంతర్జాతీయ క్రికెట్‌కు వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో గుడ్ బై