Diwali 2021: ఆ ఊర్లో స్మశానంలో దీపావళి వేడుకలు చేసుకుంటారు.. ఎందుకో తెలుసా?..

Diwali 2021: దీపావళి వేడుకలను ప్రజలు ఎంత ఘనంగా జరుపుకుంటారో అందరికీ తెలిసిందే. ఈ పర్వదినం వేళ ప్రజలంతా భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు.

Diwali 2021: ఆ ఊర్లో స్మశానంలో దీపావళి వేడుకలు చేసుకుంటారు.. ఎందుకో తెలుసా?..
Diwali 2021
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 05, 2021 | 10:04 AM

Diwali 2021: దీపావళి వేడుకలను ప్రజలు ఎంత ఘనంగా జరుపుకుంటారో అందరికీ తెలిసిందే. ఈ పర్వదినం వేళ ప్రజలంతా భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. దీపాలు, విద్యుత్ కాంతులతో ప్రజలు తమ తమ ఇళ్లను సుందరంగా అలంకరించి సంబరాలు చేసుకుంటారు. అయితే, ఇప్పుడు మనో చెప్పుకోబోయే ఊర్లో మాత్రం దీపావళి వేడులకు విచిత్రంగా జరుపుకుంటారు. దీపావళి పండుగను అందరూ ఊరిలో జరుపుకుంటే, వారు మాత్రం స్మశానంలో జరుపుకుంటారు. అనాదిగా వస్తున్న ఆచారాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఆ ఊరి జనం. వివరాల్లోకెళితే.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని పూసాల గ్రామంలో దీపావళి పండుగను వెరైటీగా జరుపుకుంటారు ఇక్కడి కొంతమంది ప్రజలు. దీపావళి పండుగను ఇంట్లో జరుపుకోకుండా తమ పూర్వీకుల సమాధుల వద్ద కొవ్వొత్తులు వెలిగించి, వారికిష్టమైన పిండివంటలు పెట్టి, అక్కడె టపాసులు కాలుస్తూ అర్ధరాత్రి వరకు ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. ఊరు ఊరంతా దీపావళి పండుగను ఊర్లో జరుపుకుంటే, వీరు మాత్రం స్మశానంలో జరుపుకుంటారు. దీపావళి రోజు ఇలా చేస్తే మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి కలుగుతుందని వారి అపార నమ్మకం.

Also read:

Katrina Kaif Vicky Kaushal: ప్రియుడు విక్కీ కౌశల్‌తో త్వరలో కత్రినా పెళ్ళి.. రాజస్థాన్‌లో ఘనంగా ఏర్పాట్లు.. (వీడియో)

Diwali 2021: ఆ ఊర్లో స్మశానంలో దీపావళి వేడుకలు చేసుకుంటారు.. ఎందుకో తెలుసా?..

Petro Politics in india: హీట్ పెంచుతున్న పెట్రో పాలిటిక్స్… పెట్రోల్ రేట్ లీటర్ 60 కి రానుందా..? (లైవ్ వీడియో)