Hyderabad: బస్సు కోసం చిన్నారి ప్రయత్నం.. ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే లేఖ రాసేసింది..
Hyderabad: తెలంగాణలో చాలా గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సు సౌకర్యం కల్పించాలంటూ
Hyderabad: తెలంగాణలో చాలా గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సు సౌకర్యం కల్పించాలంటూ అధికారులను వేడుకున్నా ఫలితం శూన్యమే అవుతుంది. ఈ నేపథ్యంలో ఓ చిన్నారి.. వినూత్న ప్రయత్నం చేసింది. బస్సులో ఆ బాలిక చేసిన ప్రయత్నం ఫలించి.. ఊర్లోకి బస్స్ రయ్‌మంటూ దూసుకువచ్చింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిదేడ్ కి పాఠశాల సమయంలో బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ వైష్ణవి అనే బాలిక.. ఏకంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమణ లేఖ రాసింది. విద్యార్థిని రాసిన లేఖకు స్పందించిన జస్టిస్ రమణ.. బస్సు సౌకర్యం కల్పించాలంటూ తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ ముఖ్యకార్యదర్శికి ఉత్వరులు జారీ చేశారు. దాంతో అలర్ట్ అయిన అధికారులు.. రీజినల్ మేనేజర్ ద్వారా ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్ బస్సు సౌకర్యం కల్పించారు. ఉదయం 7 గంటలకు ఒకసారి, మధ్యాహ్నం రెండు గంటలకు ఒకసారి మంచాల మండలం చీదేడు కు బస్సు సర్వీసును పునర్ ప్రారంభించారు ఆర్టీసీ అధికారులు. విద్యార్థి ప్రయత్నాన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులు అభినందించారు.
కాగా, విద్యార్థిని వైష్ణవి అమ్మమ్మ స్వగ్రామం చిదేడులో సంగం వెంకటయ్య, పద్మమ్మ వద్ద తల్లితో కలిసి ఉంటుంది. గత రెండు సంవత్సరాల క్రితం తండ్రి చనిపోవడంతో అమ్మమ్మ వాళ్ళ ఇంటి వద్ద ఉండి గున్‌గల్ గ్రామంలో ని ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతుంది.
Also read:
SBI Offers: ఎస్‌బీఐ కస్టమర్లకు దీపావళి ధమాకా ఆఫర్.. అతి తక్కువ వడ్డీతో ఆ రుణాలు.. వివరాలు
Viral Video: మరిది పెళ్లిలో వదిన సూపర్ డ్యాన్స్.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే