Etela Rajenders vs Harish Rao: హరీష్ వాటికే బలవుతారు.. ఈటల రాజేందర్ సెన్సేషనల్ కామెంట్స్..

Etela Rajenders vs Harish Rao: మంత్రి హరీష్ రావు పై ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సిద్దిపేటలో మీడియాతో మాట్లాడిన ఆయన.. హరీష్‌పై నిప్పులు చెరిగారు.

Etela Rajenders vs Harish Rao: హరీష్ వాటికే బలవుతారు.. ఈటల రాజేందర్ సెన్సేషనల్ కామెంట్స్..
Etela Rajendar
Follow us

|

Updated on: Nov 05, 2021 | 9:56 AM

Etela Rajenders vs Harish Rao: మంత్రి హరీష్ రావు పై ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సిద్దిపేటలో మీడియాతో మాట్లాడిన ఆయన.. హరీష్‌పై నిప్పులు చెరిగారు. తెలంగాణ కోసం పిడికిలెత్తి నిలబడ్డ గడ్డ సిద్దిపేట అని అన్నారు. ఆ నినాదాన్ని తెలంగాణ సమాజం అంతా అందిపుచ్చుకుని తెలంగాణ తెచ్చుకున్నామని పేర్కొన్నారు. సిద్దిపేట ప్రజలు హరీశ్ రావును గెలిపిస్తే.. ఆయన ఈ రోజు అధర్మం పక్షాన, అన్యాయం పక్షాన, దౌర్జన్యం పక్షాన నిలబడ్డారని వ్యాఖ్యానించారు. హరీశ్ రావు ఏ కుట్రలను, డబ్బులను, మద్యాన్ని, దాబాయింపులను నమ్ముకున్నారో వాటికే బలైయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. ‘‘వీళ్లకు అధికారం అప్పగించింది అభివృద్ధి చేయడానికి, ప్రజలను సల్లగా చూడటానికి, కానీ దౌర్జన్యం చేయడానికి, దుర్మార్గం చేయడానికి, ప్రజల గొంతుకలను నొక్కడానికి కాదు.’’ అని పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో దళితబంధు అమలు చేశారని, ఆ దళితబంధును సిద్దిపేట, గజ్వేల్ సహా తెలంగాణ అంతటా అమలు చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. సిద్దిపేటలో కూడా దళిత గర్జన సభ పెట్టే రోజు వస్తుందని, దానికి తానే నాయకత్వం వహిస్తానని ఈటల ప్రకటించారు.

హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ చేసిన కుట్రలు చూసి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుందని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో తనను ఓడించేందుకకు రూ. 500 కోట్లు పంపిణీ చేశారని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఇలాంటి వారా మా నాయకులని ప్రజలు సిగ్గుపడుతున్నారని ఈటల వ్యాఖ్యానించారు. బీజేపీకి ఓటు వేస్తే పెన్షన్ పోతుందని, సంక్షేమ పథకాలు రావని, రేషన్ కార్డు పోతుందంటూ రోజుకో అబద్ధం చెప్పి నీచానికి ఒడిగట్టారని అన్నారు. హుజురాబాద్ ప్రజలు ప్రగతి భవన్‌లో కూసున్న కేసీఆర్‌కు, సిద్దిపేటలో కూసుని కుట్రలు చేసిన హరీశ్ రావుకు కర్రుకాల్చి వాత పెట్టారని ఈటల అన్నారు.