Police Raid: ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో పోలీసుల సడెన్ అటాక్.. 46 బైక్స్, 14 కోళ్లు సీజ్..

Police Raid: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ముల్కలపల్లి, ఆంధ్రా సరిహద్దుల్లో కోడిపందాల స్థావరాలపై ములకలపల్లి పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.

Police Raid: ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో పోలీసుల సడెన్ అటాక్.. 46 బైక్స్, 14 కోళ్లు సీజ్..
Hen Fight
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 05, 2021 | 10:58 AM

Police Raid: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ముల్కలపల్లి, ఆంధ్రా సరిహద్దుల్లో కోడిపందాల స్థావరాలపై ములకలపల్లి పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏడుగురు పందెం రాయుళ్లను అరెస్ట్ చేశారు. అలాగే 46 బైక్స్, 15 కోళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముల్కలపల్లి-ఆంధ్రా సరిహద్దుల్లో గత కొంతకాలంగా గుట్టు చప్పుడు కాకుండా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. దీనిపై పక్కా సమాచారం రావడంతో.. పాల్వంచ సబ్ డివిజన్ ఇంచార్జ్ ఐపీఎస్ రోహిత్ రాజు ఆధ్వర్యంలో స్పెషల్ పోలీస్ స్క్వాడ్ టీమ్స్ ఆధ్వర్యంలో మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఏడుగురు పందెం రాయుళ్లని అరెస్ట్ చేసిన పోలీసులు.. 46 బైక్స్,15 కోళ్లు,14970 రూపాయలు నగదు,3 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకకున్నారు. కోడి పందాలు నిర్వహిస్తున్న కీలక వ్యక్తులను అరెస్ట్ చేయగా.. మరికొందరు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. దొరికిన వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

58 కేజీల గంజాయి సీజ్.. ఈ ఘటన ఇలా ఉంటే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోనే మరో కీలక ఘటన వెలుగు చూసింది. భద్రాచలం అంబేద్కర్ సెంటర్, డిగ్రీ కాలేజ్, గోళ్లగట్ట రోడ్డులో ఖమ్మం ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ టీమ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు మహిళలతో పాటు మరో వ్యక్తి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 7 లక్షల రూపాయల విలువ గల 58 కేజీల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మహారాష్ట్రకు చెందిన సురేష్ షిండే, కవిత షిండే, సునీల్ పవార్ గా గుర్తించారు. కాగా, గత 10 రోజులలో రూ. 15 లక్షల విలువచేసే ఎండు గాంజాయి స్వాధీనం చేసుకుని ఆరుగురిని అరెస్ట్ చేశారు ఖమ్మం ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు.

Also read:

Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీలో ఉక్కిరిబిక్కిరి.. ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యం..

Police Raid: ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో పోలీసుల సడెన్ అటాక్.. 46 బైక్స్, 14 కోళ్లు సీజ్..

బాలయ్య సరసన మాస్ రాజా హీరోయిన్.. నట సింహం నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా ఈ ముద్దుగుమ్మ..

ఈ దెయ్యం స్త్రీ మళ్లొస్తుంది...
ఈ దెయ్యం స్త్రీ మళ్లొస్తుంది...
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.