బాలయ్య సరసన మాస్ రాజా హీరోయిన్.. నట సింహం నెక్స్ట్ సినిమాలో హీరోయిన్‌గా ఈ ముద్దుగుమ్మ..

అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది శ్రుతిహాసన్. లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది

బాలయ్య సరసన మాస్ రాజా హీరోయిన్.. నట సింహం నెక్స్ట్ సినిమాలో హీరోయిన్‌గా ఈ ముద్దుగుమ్మ..
Balakrishna
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 05, 2021 | 10:06 AM

Shruti Haasan: అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది శ్రుతిహాసన్. లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది ఈ బ్యూటీ.. అందంతో పాటు అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది శ్రుతిహాసన్, తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలతోపాటు హిందీలోనూ మెరిసింది ఈ చిన్నది. ఇదిలా ఉంటే ఆ మధ్య శ్రుతికి ఆఫర్లు తగ్గాయని గుసగుసలు వినిపించాయి. అంతే కాదు ఆ టైంలోనే సరైన హిట్ కూడా పడలేదు శ్రుతికి.. దాంతో చిన్న గ్యాప్ వచ్చింది. గ్యాప్ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ నటించిన క్రాక్ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది ఈ బ్యూటీ. క్రాక్ సినిమాతో హిట్‌తో తిరిగి ట్రాక్‌లోకి వచ్చింది శ్రుతి.

ఇప్పుడు ఈ అమ్మడి చేతిలో భారీ సినిమాలు ఉన్నాయి, వాటిలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా ఒకటి. అయితే తాజాగా ఈ బ్యూటీకి మరో అదిరిపోయే ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. బోయపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ తుది దశకు వచ్చేసింది. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రుతి హాసన్‌ను ఎంపిక చేశారని వార్తలు వివినిపించాయి. అందుకు తగ్గట్టుగానే శ్రుతిహాసన్ ఎంపికను ఖరారు చేస్తూ చిత్రబృందం దీపావళి రోజున ఒక పోస్టర్ వదిలింది. ఈ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మిస్తుంది.

1

మరిన్ని ఇక్కడ చదవండి :

Mehreen Pirzada Birthday: మంచులో కడిగిన ముత్యంలాంటి ముద్దుగుమ్మ మెహ్రీన్..

Allu Arjun’s Pushpa : సుకుమార్ ప్లాన్ మాములుగా లేదుగా.. ‘పుష్ప’ సినిమాలో ఏకంగా వేయిమంది..

Dil Raju: రామ్ చరణ్- శంకర్ సినిమాకోసం దిల్ రాజు పెద్ద సాహసమే చేస్తున్నారుగా..!!