Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun’s Pushpa : సుకుమార్ ప్లాన్ మాములుగా లేదుగా.. ‘పుష్ప’ సినిమాలో ఏకంగా వేయిమంది..

కాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు తన ఫోకస్ అంతా పుష్ప పైనే పెట్టారు. సుకుమార్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పుష్ప సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవ్వనుంది.

Allu Arjun's Pushpa : సుకుమార్ ప్లాన్ మాములుగా లేదుగా.. 'పుష్ప' సినిమాలో ఏకంగా వేయిమంది..
Bunny
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 05, 2021 | 8:06 AM

Allu Arjun’s Pushpa : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు తన ఫోకస్ అంతా పుష్ప పైనే పెట్టారు. సుకుమార్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పుష్ప సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో బన్నీ మునుపెన్నడూ కనిపించనంత ఊర మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఈ సినిమా హీరోయిన్‌గా లక్కీ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తుంది. పుష్పలో ఈ బ్యూటీ డీగ్లామర్‌గా కనిపించనుంది. ఇక పుష్ప సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు సుకుమార్. దేవీ శ్రీ ప్రసాద్  అందిస్తున్న సంగీతం ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, సామీ సామీ పాటలు ప్రేక్షకులను విపరీతంగా కట్టుకున్నాయి. యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌ను దక్కించుకుంటున్నాయి ఈ సాంగ్స్ .

ఈ క్రమంలో తాజగా మరో పాటను చిత్రీకరిస్తున్నారు పుష్ప టీమ్. ఈపాటకు సంబంధించిన అప్డేట్‌ను ఇచ్చింది చిత్రయూనిట్. దీపావళి కానుకగా ఈ పాటకు సంబంధించిన ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటో చూస్తుంటే ఇది కూడా మాస్ సాంగ్ అని అర్ధమవుతుంది. ఈ ఫొటోలో అల్లు అర్జున్ బుల్లెట్ పై కూర్చొని కనిపిస్తున్నాడు. అలాగే ఈ పాట కోసం ఏకంగా వేయిమంది డాన్సర్లు పని చేస్తున్నారని తెలిపారు చిత్రయూనిట్. అలాగే ఈ సినిమాలో సునీల్, అనసూయ, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మలయాళ విలక్షణ నటుడు ఫహాద్‌ ఫాజిల్ ఈ సినిమాలో విలన్ గా కనిపించనున్నాడు. Pushpa

మరిన్ని ఇక్కడ చదవండి : 

Varadharajan Gopal: సినీ నటుడు డాక్టర్‌ రాజశేఖర్‌ ఇంట విషాదం

Vijay Sethupathi: విజయ్ సేతుపతి పై దాడికి అసలు కారణం అదేనా..? ఆ హీరో అభిమానులే చేశారా..?

Nabha Natesh: పరువాల పాల పిట్టలా మెరిసిన నభా నటేష్.. నండూరి ఎంకిలా ఇస్మార్ట్ బ్యూటీ..