Vijay Sethupathi: విజయ్ సేతుపతి పై దాడికి అసలు కారణం అదేనా..? ఆ హీరో అభిమానులే చేశారా..?

సూపర్ స్టార్‌ విజయ్ సేతుపతిని... బెంగుళూరు ఎయిర్‌ పోర్ట్‌లో ఓ వ్యక్తి ఎగిరి తన్నడం సంచలనంగా మారింది. అందరితో కలివిడిగా వుండే ఈ స్టార్‌ కి ఇలాంటి చేదు అనుభవం ఎదురు కావడం ఏంటని అందర్నీ ఫీల్ అయ్యేలా

Vijay Sethupathi: విజయ్ సేతుపతి పై దాడికి అసలు కారణం అదేనా..? ఆ హీరో అభిమానులే చేశారా..?
Vijay Sethupathi
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 04, 2021 | 9:08 PM

Vijay Sethupathi: సూపర్ స్టార్‌ విజయ్ సేతుపతిని… బెంగుళూరు ఎయిర్‌ పోర్ట్‌లో ఓ వ్యక్తి ఎగిరి తన్నడం సంచలనంగా మారింది. అందరితో కలివిడిగా వుండే ఈ స్టార్‌‌కి ఇలాంటి చేదు అనుభవం ఎదురు కావడం ఏంటని అందర్నీ ఫీల్ అయ్యేలా కూడా చేసింది ఆ ఘటన. అయితే సేతుపతిని ఓ ఆగంతకుడు కాలితో తన్నడం వెనుక ఓ పవర్‌ ఫుల్ కారణమే ఉందంటున్నారు కొంత మంది విశ్లేషకులు. పవర్ స్టార్‌ పునీత్ అంత్యక్రియలను ఈ ఘటనతో ముడేసి మరీ చెబుతున్నారు. కర్ణాటక, తమిళనాడు.. రెండు రాష్ట్రాల దాహార్తిని తీర్చడమే కాదు.. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ఆరని చిచ్చుకు కారణం అయింది కావేరీ నది. ఆ నదీ జలాల పంపకం కారణంగానే కన్నడిగులు, తమిళులు బద్దశత్రువులుగా మారాల్సి వచ్చింది. ప్రజలు మాత్రమే కాదు.. వారి వెంటే ఫిల్మ్ సెలబ్రిటీలు కూడా విడిపోయి సినిమాలను బ్యాన్‌ చేసుకునే స్థాయి వరకు తీసుకెళ్లింది.

ఇక ఈ వివాదం కారణంగానే కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలకు తమిళ హీరోలు ఎవరూ వెళ్లలేదు. తమిళ హీరోలు అలా వెళ్లక పోవడం పై అంతటా విమర్శలు కూడా వచ్చాయి. రాజ్‌కుమార్‌ హార్డ్ కోర్‌ అభిమానులైతే సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై తమిళ హీరోలను ఓ రేంజ్లో ఏకిపారేశారు. ఇక ఆ క్రమంలోనే హీరో విజయ్ సేతుపతి తాజాగా బెంగుళూరు ఎయిర్ పోర్ట్లో కనిపించడంతో.. ఓ కన్నడికుడు ఆవేశంతో ఇలా చేసి ఉంటాడని అంటున్నారు విశ్లేషకులు. అంతేకాని కావాలని సేతుపతి మీద దాడి చేసి ఉండకపోవచ్చని వారంటున్నారు. కాని ఏది ఏమైనా.. ఇలాంటి ఘటన శోచనీయమని వారంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sooryavanshi: ‘సూర్యవంశీ’లో ఎంఎస్ ధోని.. ఆసక్తి రేకిత్తిస్తోన్న గుల్షన్ గ్రోవర్ సీక్రెట్ పోస్ట్

Kalyan Dev’s Super Machi : లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ‘సూపర్ మచ్చి’.. ఆకట్టుకుంటున్న టీజర్

Rajinikanth’s Peddanna Review: చెల్లెలి కోసం అన్న పడే ఆరాటం ‘పెద్దన్న’