Sooryavanshi: ‘సూర్యవంశీ’లో ఎంఎస్ ధోని.. ఆసక్తి రేకిత్తిస్తోన్న గుల్షన్ గ్రోవర్ సీక్రెట్ పోస్ట్

Gulshan Grover: గుల్షన్ గ్రోవర్ ఓ సీక్రెట్ పోస్ట్‌లో ఎంఎస్ ధోని సూర్యవంశీలో భాగం కానున్నట్లు సూచించాడు. సినిమా సెట్స్‌పై వీరిద్దరూ కలిసి ఉన్న ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

Sooryavanshi: 'సూర్యవంశీ'లో ఎంఎస్ ధోని.. ఆసక్తి రేకిత్తిస్తోన్న గుల్షన్ గ్రోవర్ సీక్రెట్ పోస్ట్
Sooryavanshi Ms Dhoni And Gulshan Grover
Follow us
Venkata Chari

|

Updated on: Nov 04, 2021 | 5:35 PM

Ms Dhoni: నటుడు గుల్షన్ గ్రోవర్ సూర్యవంశీ సెట్స్ నుంచి క్రికెటర్ ఎంఎస్ ధోనితో కలిసి ఉన్న ఓ ఫొటోను పంచుకున్నాడు. దీంతో ధోని అభిమానులకు ఓ షాక్ ఇచ్చేలా క్యాప్షన్‌లో కూడా ఇచ్చాడు. ధోని ఈ సినిమాలో అతిధి పాత్ర కోసం షూట్ చేసేందుకు కూడా వచ్చి ఉండవచ్చని గుల్షన్ పేర్కొన్నాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో గుల్షన్ ఓ ట్వీట్ చేశాడు. “సోదరుడు @msdhoniతో #సూర్యవంశీ సెట్స్‌లో. ఎంఎస్ ధోని సినిమాలో నటిస్తున్నారా లేక ఇదే స్టూడియోలో షూటింగ్ కోసం వచ్చారా?” అంటూ క్యాప్షన్ అందించారు.

గుల్షన్ తన పాత్ర గెటప్‌లో ఉన్నాడు. అతను నల్లటి నెహ్రూ జాకెట్‌తో తెల్లటి కుర్తా ధరించాడు. అలాగే పొడవాటి తెల్లటి గడ్డంతో కూడా ఉన్నాడు. అదే సమయంలో ధోనీ తెల్లటి పోలో టీ షర్ట్, జీన్స్ ధరించి ఉన్నాడు.

ఈ పోస్ట్‌పై అభిమానులు కామెంట్లు కూడా చేశారు. “ఇద్దరు ఎంతో గొప్పవారు. ఆల్ టైమ్ ఫేవరెట్స్, అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచినవారు” అని ఒకరు కామెంట్ చేశారు. “సినిమా ఇప్పుడు సూపర్ స్పీడ్‌గా పూర్తి అవుతుంది!” అని మరొకరు కామెంట్ చేశారు. అలాగే అడ్వర్టైజ్‌మెంట్ షూట్ కోసం క్రికెటర్ ధోని అదే స్టూడియోలోకి ఉండవచ్చని చాలా మంది ఊహిస్తూ కామెంట్లు చేశారు. సూర్యవంశీ చిత్రంలో అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సింగం, సింగం రిటర్న్స్, సింబా తర్వాత రోహిత్ శెట్టి పోలీస్ కథతో తీస్తున్న నాల్గవ చిత్రంగా పేరుగాంచింది.

అక్షయ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) చీఫ్ DCP వీర్ సూర్యవంశీగా కనిపిస్తాడు. అతను ముంబైలో ఒక టెర్రర్ ప్లాన్‌ను విఫలం చేయడానికి రణవీర్ సింగ్ సింబా క్యారెక్టర్ ఇన్‌స్పెక్టర్ సంగ్రామ్ భలేరావ్, అజయ్ దేవగన్ సింగం క్యారెక్టర్ ఇన్‌స్పెక్టర్ బాజీరావ్ సింఘమ్‌లతో కలిసి చేరాడు. ఈ చిత్రంలో కత్రినా డాక్టర్‌గా నటిస్తోంది. సూర్యవంశీ తనకు ఎందుకు ప్రత్యేకమైన సినిమా అని అక్షయ్ ట్వీట్‌లో పేర్కొన్నాడు. “నేను నా కెరీర్‌లో చాలా యాక్షన్ చేశాను.హెలికాప్టర్‌ల నుంచి వేలాడుతూ, భవనాల మీదుగా దూకడం, బైక్ ఛేజ్‌లు ఇలా సూర్యవంశీ సినిమాలో చేశాను. ఇలా ఎన్నో విధాలుగా ఈ సినిమా నాకు ప్రత్యేకమైనది” అంటూ ట్వీట్ చేశాడు.

సూర్యవంశీ వాస్తవానికి గత ఏడాది మార్చిలో థియేటర్లలోకి రావాల్సి ఉంది. అయితే కోవిడ్ -19 మహమ్మారి కారణంగా థియేటర్లను మూసివేయవలసి వచ్చింది. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో ధర్మ ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్‌తో కలిసి రోహిత్ శెట్టి పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం (నవంబర్ 5) థియేటర్లలోకి రానుంది.

Also Read: T20 World Cup 2021: అవన్నీ ఒంటి చేతి సిక్సులు కాదు.. ప్రపంచంలో ఎవ్వరూ అలా కొట్టలేరు: భారత మాజీ క్రికెటర్

T20 World Cup 2021: కోహ్లీ కెప్టెన్సీలో హిట్‌మ్యాన్ సూపర్ హిట్.. టీమిండియాలో ఒకే ఒక్కడిగా రికార్డు.. ఎందులోనో తెలుసా?