Rahul Dravid: ‘టీ20లకు తర్వాతి కెప్టెన్ అతడే’.. రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే..
పరిమిత ఓవర్లలో టీమిండియాకు తర్వాతి కెప్టెన్ రోహిత్ శర్మే కావచ్చునని హెడ్ కోచ్‌గా ఎంపికైన రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు...
పరిమిత ఓవర్లలో టీమిండియాకు తర్వాతి కెప్టెన్ రోహిత్ శర్మే కావచ్చునని హెడ్ కోచ్‌గా ఎంపికైన రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు. అతడి అనుభవం దృష్ట్యా కెప్టెన్‌గా తన ఫస్ట్ ఛాయస్ రోహితేనని.. సెకండ్ ఛాయస్‌గా కెఎల్ రాహుల్‌ను ఎంచుకుంటానని పేర్కొన్నాడు. ఇటీవల జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాహుల్ ద్రవిడ్ తన మనసులోని మాటను చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉంటే టీ20 ప్రపంచకప్ అనంతరం టీ20 ఫార్మాట్ నుంచి కెప్టెన్‌గా వైదొలగనున్నట్లు విరాట్ కోహ్లీ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తర్వాతి కెప్టెన్ ఎవరన్న దానిపై అనేక వార్తలు వెల్లువెత్తాయి. ఈ సమయంలో తాజాగా ద్రవిడ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇక రాహుల్ ద్రవిడ్.. నవంబర్ 17 నుంచి జరగనున్న న్యూజిలాండ్ సిరీస్‌తో టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. మరి ద్రవిడ్ అన్నట్లుగా టీ20లకు తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మేనా లేక కెఎల్ రాహుల్ అవుతాడా.? బీసీసీఐ ఎవరి వైపు మొగ్గు చూపుతుంది. ఈ విషయం తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీ ఔట్.?
విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీ కూడా ప్రమాదం పడినట్లు వార్తలు వస్తున్నాయి. టీ20, వన్డేలకు ఒకే కెప్టెన్‌ను ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. విరాట్ కోహ్లీ సారధ్యంలో టీమిండియా ప్రస్తుత ఫామ్‌పై బీసీసీఐ తీవ్ర అసంతృప్తితో ఉందని తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించాలని బీసీసీఐ యోచిస్తోందని అధికారి ఒకరు జాతీయ మీడియాకు తెలిపారు. ఇక ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడక తప్పదు.
Read Also: ఉపకారం మరువని ఉడత… వీడియో చూస్తే మైమరచిపోతారు
ప్రతి ఒక్కరు విమానంలో తినే సదా అవకాశం… ఎయిర్‌క్రాఫ్ట్ రెస్టారెంట్.. ఎక్కడ ఉన్నదో తెలుసా..??