T20 World Cup 2021: అవన్నీ ఒంటి చేతి సిక్సులు కాదు.. ప్రపంచంలో ఎవ్వరూ అలా కొట్టలేరు: భారత మాజీ క్రికెటర్

రిషబ్ పంత్ మాత్రమే కాదు.. ప్రపంచంలో ఏ క్రికెటర్ కూడా ఒంటి చేత్తో సిక్సర్ కొట్టలేడు. అలా సాధ్యం కాదు అని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నారు.

T20 World Cup 2021: అవన్నీ ఒంటి చేతి సిక్సులు కాదు.. ప్రపంచంలో ఎవ్వరూ అలా కొట్టలేరు: భారత మాజీ క్రికెటర్
T20 World Cup 2021 Rishab Pant
Follow us

|

Updated on: Nov 04, 2021 | 4:34 PM

టీమిండియా వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఒంటి చేత్తో సిక్సర్ బాదుతాడనే విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. ఒప్పుకుంటారు కూడా. కానీ, ఇప్పటికీ భారత్‌కు చెందిన ఒక వెటరన్ క్రికెటర్‌ మాత్రం ఒప్పుకోవడం లేదు. అసలు అలా ఒంటిచేత్తో సిక్సర్లు కొట్టడం సాధ్యం కాదంటున్నాడు. ఈ లెజెండ్ మరెవరో కాదు.. భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. రిషబ్ పంత్ మాత్రమే కాదు.. ప్రపంచంలో ఏ క్రికెటర్ కూడా ఒంటి చేత్తో సిక్సర్ కొట్టలేడని గంభీర్ తెలిపాడు. దీని వెనుక ఉన్న కారణాన్ని వివరిస్తూ.. ఇక నుంచి వాటిని ఒంటి చేత్తో కొట్టిన సిక్సులు అనొద్దంటూ పేర్కొన్నాడు.

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ 207.69 స్ట్రైక్ రేట్‌తో 13 బంతుల్లో 27 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో 3 సిక్సర్లు, 1 ఫోర్ మాత్రమే ఉన్నాయి. ఈ సిక్సర్లన్నింటినీ పాంపంట్ తనకు తెలిసిన స్టైల్‌లో అంటే ఒంటి చేత్తో కొట్టాడు. కానీ గంభీర్ ప్రకారం, ఇది కేవలం వన్ హ్యాండ్ సిక్స్ లాగా కనిపిస్తుంది. కానీ అవి ఒంటి చేత్తో కొట్టినవి కాదని ఆయన అన్నారు.

ఏ బ్యాట్స్‌మెన్ ఒంటి చేత్తో సిక్సర్ కొట్టలేడు: గంభీర్ ఇండియా-అఫ్ఘానిస్థాన్ మ్యాచ్ అనంతరం స్టార్ స్పోర్ట్స్ షోలో గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. ‘రిషబ్ పంత్ సిక్సర్ కొట్టడం చూస్తే.. షాట్ వదిలే వరకు బ్యాట్‌తో చేయి వదలడు. అందుకే రిషబ్ పంత్ ఒంటి చేత్తో సిక్సర్ కొట్టాడనడం తప్పు. పంత్ మాత్రమే కాదు ప్రపంచంలో ఏ బ్యాట్స్‌మెన్ కూడా ఒంటి చేత్తో సిక్సర్ కొట్టలేరు’ అని వివరించారు.

4 సిక్సర్లు…అన్నీ ఒంటిచేత్తోనే.. T20 ప్రపంచ కప్ 2021లో పంత్ ఇప్పటివరకు 4 సిక్సర్లు కొట్టాడు. ఇవి మొత్తం ఒంటి చేతితో కొట్టిన సిక్సర్లే కావడం విశేషం. అకస్మాత్తుగా ఈ సిక్సర్లు కొట్టడం కాదు.. అంతకు ముందు నెట్స్ లో కూడా తీవ్రంగా ప్రాక్టీస్ చేసేవాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాతో కలిసి రిషబ్ పంత్ 21 బంతుల్లో 63 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ భాగస్వామ్యంలో హార్దిక్ పాండ్యా 13 బంతుల్లో 35 పరుగులు చేశాడు. పాండ్యా ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. 2021 టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యా తొలిసారిగా తన పాత రూపాన్ని ప్రదర్శించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ మొత్తం 210 పరుగులు చేసింది. అయితే, అఫ్గానిస్థాన్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Also Read: T20 World Cup 2021: కోహ్లీ కెప్టెన్సీలో హిట్‌మ్యాన్ సూపర్ హిట్.. టీమిండియాలో ఒకే ఒక్కడిగా రికార్డు.. ఎందులోనో తెలుసా?

T20 World Cup 2021: టీమిండియా సెమీస్ గండం నుంచి కచ్చితంగా గట్టెక్కుతుంది.. రషీద్ ఖాన్ ఏమన్నాడంటే..?

Latest Articles
త్వరపడండి.. బంపర్‌ ఆఫర్‌.. తక్కువ ధరల్లో 1.5 టన్‌ ఏసీలు..
త్వరపడండి.. బంపర్‌ ఆఫర్‌.. తక్కువ ధరల్లో 1.5 టన్‌ ఏసీలు..
వందేభారత్, వందే మెట్రో మధ్య తేడాలివే.. పూర్తి వివరాలు ఇవిగో..
వందేభారత్, వందే మెట్రో మధ్య తేడాలివే.. పూర్తి వివరాలు ఇవిగో..
23 ప్రధాన అంశాలతో టీ. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
23 ప్రధాన అంశాలతో టీ. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ప్రశ్నలు.. 2021 సీన్ రిపీట్ చేసిన రోహిత్
కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ప్రశ్నలు.. 2021 సీన్ రిపీట్ చేసిన రోహిత్
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే
అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్