Dil Raju: రామ్ చరణ్- శంకర్ సినిమాకోసం దిల్ రాజు పెద్ద సాహసమే చేస్తున్నారుగా..!!

మెగాపవర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీశ్ నిర్మిస్తోన్న భారీ పాన్ ఇండియా మూవీ సినిమా షూటింగ్ తొలి షెడ్యూల్‌ ఇటీవలే పూర్త‌య్యింది.

Dil Raju: రామ్ చరణ్- శంకర్ సినిమాకోసం దిల్ రాజు పెద్ద సాహసమే చేస్తున్నారుగా..!!
Dil Raju
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 05, 2021 | 7:45 AM

Ram Charan and Shankar: మెగాపవర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీశ్ నిర్మిస్తోన్న ఈ భారీ పాన్ ఇండియా మూవీ సినిమా షూటింగ్ తొలి షెడ్యూల్‌ ఇటీవలే పూర్త‌య్యింది. రీసెంట్‌గా స్టార్ట్ చేసి ముందుగా అనుకున్న ప్లాన్ ప్ర‌కారం ఈ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేశారు. పూనే, స‌తారా, పాల్‌ట‌న్ ప్రాంతాల్లో స్పెష‌ల్ సీక్వెన్స్‌ల‌ను ఈ షెడ్యూల్‌లో చిత్రీక‌రించారు. శంకర్ అన‌గానే సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. వాటికి ధీటుగా స్టైలిష్‌గా రామ్ చరణ్ మూవీ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. గ్రాండ్‌గా చిత్రీక‌రించిన‌ సన్నివేశాలు సినిమాలో వ‌న్ ఆఫ్ ది హైలైట్ అంశాలుగా నిలుస్తాయని తెలుస్తుంది. సినిమా కాస్ట్ అండ్ క్రూను డైరెక్ట‌ర్ శంక‌ర్ ముందుకు న‌డిపిన విధానం, ఔట్‌పుట్‌పై మేక‌ర్స్ హ్య‌పీగా ఉన్నారు.

మూవీలో స‌రికొత్త పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్‌ను శంక‌ర్ స‌రికొత్త రీతిలో ప్రెజంట్ చేయ‌బోతున్నారు. ఇటు ప్రేక్ష‌కుల‌ను, అటు మెగాభిమానుల అంచనాల‌ను మించి సినిమా ఉంటుంది. కొర‌టాల శివ‌ ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి ఆచార్య‌, ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తోక‌లిసి ఆర్ఆర్ఆర్ సినిమాల్లో న‌టించిన త‌ర్వాత‌ మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తోన్న చిత్ర‌మిది. రామ్‌చ‌ర‌ణ్ హీరోగా నటిస్తోన్న 15వ సినిమా ఇది. అలాగే శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నిర్మిస్తోన్న 50వ మూవీ కూడా ఇదే కావడం విశేషం. త‌న బ్యాన‌ర్‌లో మ‌రే సినిమాకు పెట్ట‌నంత భారీ బ‌డ్జెట్‌తో, గ్రాండ్ స్కేల్‌తో ఇండియ‌న్ సినిమాల్లోనే ల్యాండ్ మార్క్ మూవీలా నిలిచిపోయేలా దిల్‌రాజు, శిరీశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ప‌లు భాష‌ల్లో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. కియారా అద్వానీ, జ‌యరామ్‌, అంజ‌లి, సునీల్, శ్రీకాంత్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌ సంగీతం సార‌థ్యం వహిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Varadharajan Gopal: సినీ నటుడు డాక్టర్‌ రాజశేఖర్‌ ఇంట విషాదం

Vijay Sethupathi: విజయ్ సేతుపతి పై దాడికి అసలు కారణం అదేనా..? ఆ హీరో అభిమానులే చేశారా..?

Nabha Natesh: పరువాల పాల పిట్టలా మెరిసిన నభా నటేష్.. నండూరి ఎంకిలా ఇస్మార్ట్ బ్యూటీ..