Swetha Varma: అతను అలా అడిగాడు.. క్యాస్టింగ్ కౌచ్ పై బిగ్ బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్..
బిగ్ బాస్ సీజన్ 5తో ప్రేక్షకులకు దగ్గరయింది శ్వేతవర్మ. సీజన్ 5 లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్వేతవర్మ తనదైన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Swetha Varma: బిగ్ బాస్ సీజన్ 5తో ప్రేక్షకులకు దగ్గరయింది శ్వేతవర్మ. సీజన్ 5 లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్వేతవర్మ తనదైన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్ట్రాంగ్ కటెస్టెంట్‌గా కంటిన్యూ అయిన శ్వేత.. అనూహ్యంగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది. అయితే శ్వేతవర్మ బిగ్ బాస్ కంటే ముందు కొన్ని సినిమాల్లో నటించింది. కానీ ఆమెకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఇక ఇప్పుడు శ్వేతవర్మ అందరికి సుపరిచితులుగా మారిపోయింది. తాజాగా శ్వేతవర్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. క్యాస్టింగ్ కౌచ్ పై ఆసక్తిగా కామెంట్స్ చేసింది. సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చిందేమీ కాదు. ఎప్పటినుంచో దీనిపై వార్తలు వస్తూనే ఉన్నాయి. రకరాల సందర్భాల్లో హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎదుర్కొన్న చేదు అనుభవాలను చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే శ్వేతవర్మ కూడా తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయట పెట్టింది.
తనతో చాలా మంది అసభ్యకరంగా మాట్లాడేవారని.. ఛాన్స్ ఇస్తాం కమిట్‌మెంట్ ఇస్తారా అంటూ అడిగారని చెప్పుకొచ్చింది. పారితోషికం ఎంతైనా ఇస్తాం.. మాకు సహకరించాలని అనేవారు. అప్పుడు దానికి అర్ధం నాకు తెలిసేది కాదు. ఆ తర్వాత సహకరించడం అంటే వేరే అర్ధాలు ఉంటాయని తెలుసుకున్నా.. అని చెప్పుకొచ్చింది. అలాగే ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి ఓ యాడ్ షూటింగ్ ఉంది, రెమ్యునరేషన్ లక్ష రూపాయల వరకు ఇస్తాం.. కానీ తమకు సహకరించాలని అడిగాడు.. ఇది 2015లో జరిగింది. నాతో అలా మాట్లాడటంతో కోపం వచ్చి నాకు లక్ష రూపాయలు ఇస్తే నేను కమిట్ మెంట్ ఇవ్వాలంటున్నారు.. మరి నేను ఎతైన బిల్డింగ్ మీద నుంచి దూకమంటా.. దూకుతారా..? అని ప్రశ్నించా.. దాంతో అవతలి వ్యక్తి సైలెంట్ అయ్యాడు. నేను ట్యాలెంట్‌ను నమ్ముకుని ఇండస్ట్రీలో కొనసాగుతున్నా.. బిగ్ బాస్ తర్వాత ఇప్పుడు పలు సినిమాల్లో, వెబ్ సిరీస్‌లలో ఛాన్స్‌లు వస్తున్నాయి అని తెలిపింది శ్వేతవర్మ.
మరిన్ని ఇక్కడ చదవండి :