Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీలో ఉక్కిరిబిక్కిరి.. ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యం..

Delhi Air Pollution: దీపావళి పండుగ అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. రాజధానిలో టపాసులు కాల్చడంపై నిషేధం విధించినా.. అన్ని ప్రాంతాల్లో

Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీలో ఉక్కిరిబిక్కిరి.. ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యం..
Delhi Air Pollution
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 05, 2021 | 10:10 AM

Delhi Air Pollution: దీపావళి పండుగ అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. రాజధానిలో టపాసులు కాల్చడంపై నిషేధం విధించినా.. అన్ని ప్రాంతాల్లో ప్రజలు టపాసులను కాల్చారు. దీంతో ఢిల్లీని వాయు కాలుష్యం ముంచెత్తింది ఢిల్లీ, ఎన్సీఆర్ లో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకరస్థాయికి చేరినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలోని పూసా రోడ్డులోనూ గాలి నాణ్యత బాగా క్షీణించింది. ఢిల్లీలో గురువారం సాయంత్రం 4 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 382 వరకు ఉంది. అయితే.. దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చడంతో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోయినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ ఎన్సీఆర్ లోని పలు ప్రాంతాల్లో ఏక్యూఐ 500 దాటింది. ఢిల్లీలో పూసారోడ్డు వద్ద 505 కు చేరినట్లు అధికారులు తెలిపారు. ఏక్యూఐ 500 దాటిందంటే కాలుష్యం ప్రమాదస్థాయికి చేరినట్లేనని అధికారులు తెలిపారు.

కాగా.. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో టపాసులు కాల్చిన అనంతరం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ఫరీదాబాద్లో (424), ఘజియాబాద్ (442), గుర్గావ్ (423), నోయిడా (431) చొప్పున నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం బాణాసంచాపై నిషేధం విధించినప్పటికీ, దీపావళి సందర్భంగా చాలా మంది ప్రజలు వీధుల్లో క్రాకర్లు కాల్చారని.. దీంతో వాయుకాలుష్యం తీవ్రంగా పెరిగినట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. ఢిల్లీలో వాయు కాలుష్యం వల్ల చాలా మంది ప్రజల నుంచి గొంతు, దురద,కళ్ల నుంచి నీరు కారుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే.. ఈ కాలుష్యం మరో మూడు రోజుల పాటు ఇలానే ఉంటుందని.. ఆతర్వాత తగ్గే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

AQI ఎంత ఉంటే మంచిది?

– 0-50: మంచిగా ఉన్నట్లు – 51 – 100: సంతృప్తికరం – 101-200: మధ్యస్తం – 201 – 300: పూర్ – 301 – 400: వెరీ పూర్ – 401 – 500: గాలి నాణ్యత తీవ్రంగా ఉన్నట్లు పరిగణిస్తారు.

Also Read:

SBI Offers: ఎస్‌బీఐ కస్టమర్లకు దీపావళి ధమాకా ఆఫర్‌.. అతి తక్కువ వడ్డీతో ఆ రుణాలు.. వివరాలు

Hooch Tragedy: కాటేసిన కల్తీ మద్యం.. బీహార్‌లో 24 మంది మృత్యువాత.. మరికొంత మంది పరిస్థితి..