SBI Offers: ఎస్‌బీఐ కస్టమర్లకు దీపావళి ధమాకా ఆఫర్.. అతి తక్కువ వడ్డీతో ఆ రుణాలు.. వివరాలు
SBI Diwali Offers: దీపావళి పర్వదినాన్ని మరింత ప్రత్యేకంగా చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్‌లను అందుబాటులోకి తెచ్చింది. దేశంలో అతిపెద్ద
SBI Diwali Offers: దీపావళి పర్వదినాన్ని మరింత ప్రత్యేకంగా చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్‌లను అందుబాటులోకి తెచ్చింది. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్‌బీఐ కార్ లోన్, గోల్డ్ లోన్, పర్సనల్ లోన్‌లపై పలు ఆఫర్లను ప్రకటించింది. దీపావళి పండుగను పురస్కరించుకొని.. “ఎస్‌బీఐ కార్ లోన్, పర్సనల్ లోన్, గోల్డ్ లోన్‌పై అద్భుతమైన ఆఫర్‌లతో దీపాల పండుగను మరింత ప్రత్యేకంగా జరుపుకోండి” అంటూ SBI తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ట్వీట్ చేసి వెల్లడించింది. బ్యాంక్ అందించిన సమాచారం ప్రకారం.. ఈ రుణాలపై బ్యాంక్ జీరో ప్రాసెసింగ్ రుసుమును ఆఫర్ చేస్తోంది. ఇంకా, ఎస్‌బీఐ సంవత్సరానికి 9.6 శాతం వడ్డీతో వ్యక్తిగత రుణాన్ని, సంవత్సరానికి 7.25 శాతంతో కార్ లోన్, 7.50 శాతంతో బంగారు రుణాన్ని అందించనుంది.
ఈ పండుగ సీజన్‌లో ఎస్‌బీఐ జీరో ప్రాసెసింగ్ ఫీజుతో గృహ రుణాలను కూడా అందిస్తోంది. ఇంకా రుణ మొత్తంతో సంబంధం లేకుండా కేవలం 6.70 శాతం వద్ద క్రెడిట్ స్కోర్ లింక్డ్ హోమ్ లోన్‌లను అందిస్తుంది. అంతకుముందు రూ.75 లక్షల కంటే ఎక్కువ రుణం పొందే రుణగ్రహీతలు 7.15 శాతం వడ్డీ రేటును చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు పండుగ ఆఫర్‌ల నేపథ్యంలో రుణగ్రహీత ఇప్పుడు 6.70 శాతం కంటే తక్కువ వడ్డీ రేటుతో ఎంతయిన గృహ రుణాన్ని పొందవచ్చు.
Celebrate the festival of lights with exciting offers on #SBI Car Loan, Personal Loan and Gold Loan.
Know more: https://t.co/1RhV1IpQyW or apply at https://t.co/yjDSsj2O4L#HarTyohaarShubhShuruaat #CarLoan #PersonalLoan #GoldLoan #ZeroProcessingFee #YONO #YONOSBI #DiwaliOffer pic.twitter.com/wATQyFaOYk
— State Bank of India (@TheOfficialSBI) November 3, 2021
ఈ ఆఫర్ కారణంగా 45 బిపిఎస్ ఆదా అవుతుంది. ఇది 30 సంవత్సరాల కాలపరిమితితో కూడిన రూ.75 లక్షల లోన్‌పై రూ.8 లక్షల కంటే ఎక్కువ వడ్డీ ఆదా అవుతుంది. జీతం లేని రుణగ్రహీతకు వర్తించే వడ్డీ రేటు.. జీతం తీసుకునే రుణగ్రహీతకు వర్తించే వడ్డీ రేటు కంటే 15 బీపీఎస్ ఎక్కువగా ఉంది. అయితే.. ఈ వ్యత్యాసాన్ని తొలగిస్తూ ఎస్‌బీఐ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ ప్రయోజనాలు పొందడానికి ఎస్‌బీఐ కస్టమర్‌లు SBI YONO యాప్ ద్వారా లోన్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతోపాటు sbiyono.sbiకి కూడా లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాసెస్, స్కీమ్‌ల వివరాల కోసం ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ sbi.co.in కు లాగిన్ కావాలి.
Also Read: