Tiger Fear: ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం.. జనావాసాల్లో తిరుగాడుతున్న బెబ్బులి.. భయాందోళనలో జనాలు..
Telangana - Tiger Fear: అడవుల జిల్లా ఆదిలాబాద్‌ను వన్యమృగాలు భయపడెతున్నాయి. ముఖ్యంగా పెద్దపులి అక్కడి ప్రజలను హడలెత్తిస్తోంది. తాజగా ఆదిలాబాద్ జిల్లా
Telangana – Tiger Fear: అడవుల జిల్లా ఆదిలాబాద్‌ను వన్యమృగాలు భయపడెతున్నాయి. ముఖ్యంగా పెద్దపులి అక్కడి ప్రజలను హడలెత్తిస్తోంది. తాజగా ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సోనాల గ్రామంలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపింది. ప్రధాన రహదారిపై దర్జాగా సంచరిస్తూ గ్రామస్తుల కంట పడింది పెద్దపులి. దానిని చూసిన ప్రజలు బెంబేలెత్తిపోయారు. సోనాల గ్రామ ప్రజలతో పాటు.. సమీప గ్రామాల ప్రజలు సైతం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
బెబ్బులి సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు ప్రజలు. కాగా, పెద్దపులి ఎక్కడ తమ గ్రామంలో వస్తుందోనని భయపడుతున్నారు సోనాల, సాకెరా, ఘనపూర్ గ్రామస్తులు. అటవీ అధికారులు త్వరగా స్పందించి.. జనావాసాల్లో తిరుగుతున్న పెద్దపులిని బంధించాలని వేడుకుంటున్నారు. లేదంటే ప్రజల ప్రాణాలకు ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also read:
Neem Tree: వేప చెట్లకు అంతుచిక్కని వింత వ్యాధి..! ఉన్నట్టుండి ఎండిపోతున్న వేపచెట్లు.. (వీడియో)
Mehreen Pirzada Birthday: మంచులో కడిగిన ముత్యంలాంటి ముద్దుగుమ్మ మెహ్రీన్..