PM Narendra Modi: ఆదిశంకరాచార్యుల సమాధి సన్నిధికి ప్రధాని మోదీ.. కేదార్నాథ్ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు..
PM Narendra Modi Kedarnath visit: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ఉదయం చార్‌ధామ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని
PM Narendra Modi Kedarnath visit: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ఉదయం చార్‌ధామ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మంచ్‌దార్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయాన్నే ప్రధాని మోదీ ఉత్తరాఖండ్ డెహ్రడూన్‌కి చేరుకుని అక్కడి నుంచి కేదార్నాథ్ చేరుకున్నారు. అనంతరం పర్వత శ్రేణుల్లో కలినడకన నడుస్తూ ఆలయానికి చేరుకున్నారు. అనంతరం కేదార్నాథ్ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
Uttarakhand | Prime Minister Narendra Modi offers prayers at Kedarnath temple pic.twitter.com/ApNYwczb94
— ANI (@ANI) November 5, 2021
Uttarakhand | PM Modi arrives at Kedarnath, to offer prayers at the shrine and also inaugurate Adi Shankaracharya Samadhi shortly pic.twitter.com/Lt1JGtxXFQ
— ANI (@ANI) November 5, 2021
ప్రార్థనల అనంతరం ప్రధాని మోదీ ఈ సందర్భంగా కేదార్నాథ్లో కొత్తగా నిర్మించిన సద్గురు ఆది శంకరాచార్యుల సమాధి స్థల్ ను, శంకరాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతేకాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. కేదార్నాథ్ ఆలయ ప్రాంగంణంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులతోపాటు మొత్తం 130 కోట్ల ఇన్ఫ్రా ప్రాజెక్టులను ప్రారంభించారు.
2013 లో వచ్చిన భారీ వరదలకు ఆది శంకరాచార్య సమాధితో పాటు కేదార్‌నాథ్‌లో పలు కట్టడాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో వాటిని పునర్నిర్మించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో కేదార్నాథ్ ఆలయాన్ని 8క్వింటాళ్ల పూలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. భద్రతా బలగాలను మోహరించి పకడ్బంధీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు.
Also Read: