Katrina Kaif Vicky Kaushal: ప్రియుడు విక్కీ కౌశల్‌తో త్వరలో కత్రినా పెళ్ళి.. రాజస్థాన్‌లో ఘనంగా ఏర్పాట్లు.. (వీడియో)
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్, ఆమె ప్రియుడు విక్కీ కౌశల్ త్వరలోనే వివాహ బంధంతో ఓ ఇంటి వారు కాబోతున్నట్లు తెలుస్తోంది. వారి పెళ్లి ఏర్పాట్లకు సంబంధించిన అంశాలు బాలీవుడ్ మీడియా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్, ఆమె ప్రియుడు విక్కీ కౌశల్ త్వరలోనే వివాహ బంధంతో ఓ ఇంటి వారు కాబోతున్నట్లు తెలుస్తోంది. వారి పెళ్లి ఏర్పాట్లకు సంబంధించిన అంశాలు బాలీవుడ్ మీడియా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. డిసెంబరు మొదటి వారంలో వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మ్యారేజ్ వెన్యూ ఎక్కడన్న అంశం కూడా లీక్ అయ్యింది. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సస్ ఫోర్ట్ బర్వారాలో వారిద్దరి పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించనున్నట్లు సమాచారం.
వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు చాలా కాలంగానే గుసగుసలు వినిపిస్తున్నాయి. సెలబ్రిటీల బర్త్ డే పార్టీలు, ఇతరత్ర ప్రైవేటు కార్యక్రమాలకు వారిద్దరూ కలిసే హాజరుకావడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోంది. అయితే తమ మధ్య రిలేషన్‌షిప్‌ను వారిద్దరూ సీక్రెట్‌గా ఉంచేందుకే ప్రయత్నించారు. ఇటీవల కత్రినా కైఫ్‌ను ఓ ఇంటర్వ్యూలో వారిద్దరి మధ్య రిలేషన్‌షిప్ గురించి వినిపిస్తున్న పుకార్ల గురించి ప్రశ్నించగా.. ఇదే ప్రశ్నను తాను 15 ఏళ్లుగా ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో వారిద్దరూ వివాహ బంధంతో ఒక్కటికావాలని నిర్ణయించుకున్నారని.. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
కత్రినా కైఫ్ వివాహ డ్రెస్‌ను దిగ్గజ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ డిజైన్ చేయబోతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ డిజైన్‌కు సంబంధించిన రూపకల్పనలో ఇప్పటికే ఆయన టీమ్ తలమునకలై ఉన్నట్లు బాలీవుడ్ మీడియా వర్గాలు తెలిపాయి. అయితే కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ సన్నిహితులు మాత్రం వారిద్దరి పెళ్లి వార్తను ధృవీకరించడం లేదు. ఇద్దరూ పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తమ దగ్గర ఎలాంటి సమాచారం లేదంటున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)
Hebah Patel: ఏంజెల్ లా మెరుస్తున్న ‘హెబ్బా పటేల్’.. ఇలా చుస్తే ఎవరైనా పడిపోవాల్సిందే.. (ఫొటోస్)