Woman With Cobra: డాక్టర్ గారూ ఇదే పాము కాటేసింది..అంటూ కాటేసిన పాముతో ఆస్పత్రికి.. అంతా షాక్..! (వీడియో)
అదో ప్రభుత్వాసుపత్రి. రోగులతో కిటకిటలాడుతోంది. అక్కడి వైద్యుడు రోగులను చూడడంలో బిజీగా ఉన్నాడు. ఇంతలో ఓ మహిళ అక్కడి వచ్చింది. డాక్టర్ గారు ఈ పామే నా కూతుర్ని కాటేసిందని చెబుతూ..
అదో ప్రభుత్వాసుపత్రి. రోగులతో కిటకిటలాడుతోంది. అక్కడి వైద్యుడు రోగులను చూడడంలో బిజీగా ఉన్నాడు. ఇంతలో ఓ మహిళ అక్కడి వచ్చింది. డాక్టర్ గారు ఈ పామే నా కూతుర్ని కాటేసిందని చెబుతూ..తాను చేతిలో పట్టుకువచ్చిన పామును చూపించింది. అంతే.. అక్కడే ఉన్న డాక్టర్‌తో పాటు అక్కడి రోగులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆమె చేతిలో ఓ చిన్న సైజు కట్ల పాము కనిపించింది..అది ఇంకా బతికే ఉండడంతో దాన్ని చూసిన కొందరు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది.
కర్ణాటకలోని డెంకణీకోట తాలూకా బయలకాడు గ్రామానికి చెందిన మణి కూతురు ఐదేళ్ల సంచనశ్రీ ఇంటి ముందు ఆడుకుంటుండగా చిన్న సైజు కట్ల పాము కాటు వేసింది. చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు గుమిగూడారు..వెంటనే పామును కొట్టి సంచిలో వేసుకొని చిన్నారిని డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు…పాపను ఇదే పాము కాటేసిందని వైద్యులకు చూపించారు..మహిళ చేతిలోని పామును చూసి అక్కడే ఉన్న వైద్య సిబ్బంది, రోగులు భయంతో పరుగులు తీశారు. కానీ, సకాలంలో ఆస్పత్రికి తీసుకురావడంతో చిన్నారిని రక్షించగలిగామని డాక్టర్లు తెలిపారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)
Hebah Patel: ఏంజెల్ లా మెరుస్తున్న ‘హెబ్బా పటేల్’.. ఇలా చుస్తే ఎవరైనా పడిపోవాల్సిందే.. (ఫొటోస్)
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

