Viral Video: ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా కొరడా దెబ్బలు.. ఎందుకలా చేశారంటే..

Viral Video: అతనొక ముఖ్యమంత్రి, నిత్యం పది మంది సెక్యూరిటీ గార్డ్‌లు వెంట ఉంటారు. ఈగ వాలాలన్నా వారి పర్మిషన్‌ ఉండాల్సిందే. అలాంటిది అదే ముఖ్యమంత్రిని ఓ వ్యక్తి కొరడాతో కొట్టాడు. దీనంతటినీ అక్కడే ఉన్న వారు...

Viral Video: ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా కొరడా దెబ్బలు.. ఎందుకలా చేశారంటే..
Cm Getting Whipped
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 05, 2021 | 4:19 PM

Viral Video: అతనొక ముఖ్యమంత్రి, నిత్యం పది మంది సెక్యూరిటీ గార్డ్‌లు వెంట ఉంటారు. ఈగ వాలాలన్నా వారి పర్మిషన్‌ ఉండాల్సిందే. అలాంటి ముఖ్యమంత్రిని ఓ వ్యక్తి కొరడాతో కొట్టాడు. దీనంతటినీ అక్కడే ఉన్న వారు చూస్తూ వీడియోలు తీశారు కానీ అడ్డుకోలేదు. ముఖ్యమంత్రిని కొరడాతో కొట్టడం, దానిని వీడియో తీయడం ఏంటని ఆలోచిస్తున్నారు కదూ.! అయితే ఇదంతా ఓ ఆచారంలో భాగమేలేండి. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌ఘడ్‌ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ శుక్రవారం శుక్రవారం రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలోని ఒక గ్రామంలో గోవర్ధన్ పూజ పండుగ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్బంగానే ఆచారంలో భాగంగా ఆయన కొరడాతో కొట్టించుకున్నారు.

స్థానిక సంప్రదాయం ప్రకారం ‘సొంట’ (గడ్డితో చేసిన కొరడా) అనే కొరడాతో కొట్టించుకుంటారు. సంప్రదాయ వేషదారణ, తలపై పాగా ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. అయితే సీఎం లాంటి వ్యక్తి ఇలా దెబ్బలు తినడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ విషయమై ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమాన్ని కోరి ఇలా చేశానని చెప్పుకొచ్చారు. ఇక ఈ వీడియోను ట్వీట్ చేసిన ముఖ్యమంత్రి.. అన్ని అడ్డంకులు తొలిగిపోయి, ప్రజలంతా సంతోషంగా ఉండాలనే ఇలా చేశాను అంటూ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే ప్రతి ఏటా ఛత్తీస్‌గఢ్‌లో గోవర్ధన్‌ పూజను నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా గోవుకు పూజలు చేస్తారు. ఈ వేడుకల్లో భాగంగానే కొందరు కొరడా దెబ్బలు తిని, తమ కోరికలు నెరవేరాలను కోరుకుంటారు. సీఎం లాంటి వ్యక్తి కూడా సంప్రదాయానికి పెద్ద పీట వేయడంతో అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: BHEL: బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగాల పేరుతో నకిలీ వెబ్‌సైట్‌.. జాగ్రత్త అంటోన్న అధికారులు..

Raviteja: ‘రావణాసుర’ గా రవితేజ.. అదిరిపోయిన మాస్‌ మహారాజా ఫస్ట్‌ లుక్‌..

Tollywood Diwali celebrations: దీపావళి కాంతుల్లో మెరిసిన మన సినీ తారలు.. ఆకట్టుకుంటున్న ఫొటోస్…