Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FD Interest Rates: సీనియర్ సిటిజన్ల ఫిక్సిడ్ డిపాజిట్లపై అధిక వడ్డీ ఇస్తున్న ప్రైవేటు బ్యాంకులు ఇవే.. పూర్తి వివరాలు

FD Interest Rates: సీనియర్ సిటిజన్లు ఎక్కువగా బ్యాంకు ఫిక్సిడ్ డిపాజిట్లలో తమ సొమ్మును దాచుకుంటారు. తమ నగదుకు భద్రతతో పాటు ఓ ఆదాయ వనరుగా దీన్ని భావిస్తారు.

FD Interest Rates: సీనియర్ సిటిజన్ల ఫిక్సిడ్ డిపాజిట్లపై అధిక వడ్డీ ఇస్తున్న ప్రైవేటు బ్యాంకులు ఇవే.. పూర్తి వివరాలు
FD Interest Rates
Follow us
Janardhan Veluru

|

Updated on: Nov 05, 2021 | 4:27 PM

FD Interest Rates: సీనియర్ సిటిజన్లు ఎక్కువగా బ్యాంకు ఫిక్సిడ్ డిపాజిట్లలో తమ సొమ్మును దాచుకుంటారు. తమ నగదుకు భద్రతతో పాటు ఓ ఆదాయ వనరుగా దీన్ని భావిస్తారు. ఫిక్సిడ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీతో తమ బ్రతుకు బండిని నడుపుతుంటారు. ఆర్బీఐ గత కొంత కాలంగా 4 శాతం రెపో రేటును యధాతథంగా కొనసాగిస్తోంది. దీంతో ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను చాలా బ్యాంకులు తగ్గించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోల్చితే సీనియర్ సిటిజన్ల ఫిక్సిడ్ డిపాజిట్లపై ప్రైవేటు బ్యాంకులే అధిక వడ్డీరేట్లు అందిస్తున్నాయి. మూడేళ్ల వరకు ఎఫ్‌డీ చేసే మొత్తంపై కొన్ని ప్రైవేటు బ్యాంకులు 7 శాతం వరకు వడ్డీరేటును ఇస్తున్నాయి. సీనియర్ సిటిజన్ల మూడు సంవత్సరాల ఎఫ్‌డీలపై అధిక వడ్డీ రేటు ఇస్తున్న ఐదు ప్రైవేటు బ్యాంకులు ఏవేవో తెలుసుకోండి.

1.యస్ బ్యాంక్ (Yes Bank) సీనియర్ సిటిజన్ల మూడేళ్ల ఎఫ్‌డీలపై 7 శాతం వడ్డీ ఇస్తోంది. ప్రైవేటు బ్యాంకుల్లో మిగిలిన బ్యాంకుల కంటే అధిక వడ్డీ రేటు ఇస్తున్న బ్యాంకు ఇదే. సీనియర్ సిటిజన్లు రూ.1 లక్షలను ఈ బ్యాంకులో ఎఫ్‌డీ చేస్తే.. వడ్డీతో కలుపుకుని మూడేళ్ల తర్వాత రూ.1.23 లక్షలు చేతికందుతుంది.

2.ఆర్బీఎల్ బ్యాంక్ (RBL Bank) సీనియర్ సిటిజన్ల మూడేళ్ల ఎఫ్‌డీలపై 6.80 శాతం వడ్డీ ఇస్తోంది. రూ.1 లక్షను ఈ బ్యాంకులో ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తే.. మూడేళ్ల తర్వాత వడ్డీతో కలుపుకుని రూ.1.22 లక్షలు చేతికందుతుంది.

3.ఇండస్‌ఇండ్ బ్యాంక్ (IndusInd Bank) సీనియర్ సిటిజన్ల మూడేళ్ల ఎఫ్‌డీలపై 6.50 శాతం వడ్డీ ఇస్తోంది. రూ.1 లక్షను ఈ బ్యాంకులో ఎఫ్‌డీ చేస్తే.. మూడేళ్ల తర్వాత వడ్డీ కలుపుకుని రూ.1.21 లక్షలు చేతికందుతుంది. కనిష్ఠ మొత్తం రూ.10వేలు ఎఫ్‌డీ చేయాల్సి ఉంటుంది.

4.డీసీబీ బ్యాంక్ (DCB Bank) సీనియర్ సిటిజన్ల మూడేళ్ల ఎఫ్‌డీలపై 6.45 శాతం వడ్డీ ఇస్తోంది. ఈ బ్యాంకులో రూ.1 లక్ష ఎఫ్‌డీ చేస్తే.. మూడేళ్ల తర్వాత వడ్డీతో కలుపుకుని రూ.1.21 లక్షలు చేతికి అందుతుంది. ఈ బ్యాంకులోనూ కనిష్ఠ మొత్తం రూ.10,000 ఎఫ్‌డీ చేయాల్సి ఉంటుంది.

5.ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ (IDFC First Bank) సీనియర్ సిటిజన్ల మూడేళ్ల ఎఫ్‌డీలపై 6.25 శాతం వడ్డీ ఇస్తోంది. రూ.1 లక్ష ఎఫ్‌డీ చేస్తే మూడేళ్ల తర్వాత వడ్డీతో కలుపుకుని రూ.1.20 లక్ష చేతికి అందుతుంది.

కొత్త డిపాజిట్లను ఆకర్షించేందుకు చిన్న ప్రైవేటు బ్యాంకులు ఎఫ్‌డీలపై అధిక వడ్డీ రేటు ఇస్తున్నాయి. ఈ బ్యాంకుల్లో ఎఫ్‌డీలపై రూ.5 లక్షల వరకు ఆర్బీఐ ఆధీనంలోని డీఐసీజీసీ గ్యారెంటీ కల్పిస్తోంది.

Also Read..

Note Ban: నోట్ల రద్దుకు ఐదేళ్లు.. మరి ప్రస్తుతం జనాల చేతుల్లో నగదు తగ్గిందా.? పెరిగిందా.? పూర్తి వివరాలు..

Viral Video: ఎలుగు బంటికి చుక్కలు చూపించిన పిల్లి.. వీడియో చూస్తే నవ్వుకుండా ఉండలేరు..