Note Ban: నోట్ల రద్దుకు ఐదేళ్లు.. మరి ప్రస్తుతం జనాల చేతుల్లో నగదు తగ్గిందా.? పెరిగిందా.? పూర్తి వివరాలు..
Note Ban: వ్యవస్థలో పేరుకుపోయిన నల్లడబ్బును పూర్తిగా తొలగించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం నోట్ల రద్దు. నవంబర్ 8, 2016లో కేంద్ర ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో..
Note Ban: వ్యవస్థలో పేరుకుపోయిన నల్ల ధనాన్ని పూర్తిగా తొలగించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం నోట్ల రద్దు. నవంబర్ 8, 2016లో కేంద్ర ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వం తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయానికి మరో మూడు రోజుల్లో ఐదేళ్లు ముగియనున్నాయి. మరి ఆర్థిక వ్యవస్థలో నగదు లావా దేవీలను తగ్గించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ నిర్ణయం ఏ మేరా విజయవంతమైంది.? ప్రస్తుతం ప్రజలల చేతుల్లో నగదు నిల్వలు పెరిగియా.? తగ్గాయా.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నగదు రద్దు మొదట్లో మంచి ఫలితాన్నే ఇచ్చింది ముఖ్యంగా నవంబర్ 8 2016లో రూ.500, రూ.1,000 నోట్లను ఉపసంహరించుకున్న తర్వాత, నవంబర్ 4, 2016న రూ.17.97 లక్షల కోట్లుగా ఉన్న ప్రజల వద్ద ఉన్న కరెన్సీ, 2017 జనవరి నాటికి రూ.7.8 లక్షల కోట్లకు తగ్గింది. ఈ లెక్కన చూసుకుంటే నగదు లావాదేవీలు తగ్గాయి. అయితే తదనంతర పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ నగదు లావాదేవీలు భారీగా పెరిగాయి. అక్టోబర్ 8, 2021తో ప్రజల వద్ద కరెన్సీ రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 28.30 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ లెక్కన చూస్తే ఈ పెంపు ఏకంగా 57.48 శాతం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమాచారం ప్రకారం దీపావళి పండుగకు ముందు ప్రజల వద్ద ఉన్న నగదు రూ. 15,582 కోట్లకు పెరిగింది. గతేడాదితో పోలీస్తే 8.5 శాతం పెరిగింది.
కరెన్సీ పెరగడానికి కారణాలు ఏంటి.?
నిజానికి నోట్ల రద్దు వ్యవహారం తర్వాత డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయి. యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చిన్న కొనుగోళ్లకు కూడా ఆన్‌లైన్ పేమెంట్స్ చేయడం అలవాటుగా మారిపోయింది. అయితే కరోనా తర్వాత పరిస్థితుల మారిపోయాయి. కరోనా సమయంలో ఆర్థిక వ్యవస్థ స్థంభించిపోవడంతో ప్రజలు తమ నగుదును బ్యాంకుల్లో కంటే చేతిలో ఉంచుకోవడానికే మొగ్గు చూపారు. దీంతో వ్యవస్థలో నగదు క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఏటీఎంలలో డబ్బును జమచేసే ప్రముఖ కంపెనీ సీఎమ్‌ఎస్ ఇన్ఫో సిస్టమ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ కౌల్ మాట్లాడుతూ.. భారత్‌లో చాలా చోట్ల లావాదేవీల్లో నగుదు ప్రాధాన్యంగా మారుతోంది. సీఎస్‌సీ కంపెనీ గడిచిన కొన్ని రోజుల్లో ఏకంగా రూ. 9.15 లక్షల కోట్లకు పైగా నగదును ఏటీఎంలకు తరలించినట్లు’ ఆయన తెలిపారు. దీపావళికి ఎక్కువ మంది ప్రజలు నగదు చెల్లింపులే చేసినట్లు సమాచారం. దాదాపు 15 కోట్ల మందికి ఇంకా బ్యాంకు ఖాతా లేకపోవడం కూడా నగదు లావాదేవీలకు కారణంగా చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ఈకామర్స్ కంపెనీలు టైర్ ఫోర్ పట్టణాల్లో 90 శాతం నగదు లావాదేవీనే వినియోగిస్తున్నట్లు తేలింది. ఇక సీఎమ్‌ఎస్ క్యాష్ ఇండెక్స్ ప్రకారం 2018 నుంచి ప్రతీ పండుగల సీజన్‌లో నగదు లావాదేవీలు పెరిగినట్లు తేలింది. మూడేళ్లలో నగదు లావాదేవీలు 9 నుంచి 19 శాతం పెరిగినట్లు తేటతెల్లమైంది.
Also Read: Ram Charan : పునీత్ లేరంటే నమ్మలేకపోతున్నా.. ఎమోషనల్ అయిన రామ్ చరణ్..
Andhra Pradesh: ఉద్యోగుల హాజరుపై ఏపీ సర్కార్ సంచలన ఆదేశాలు.. ఆ నిబంధనలు తప్పనిసరి
Andhra Pradesh: ఉద్యోగుల హాజరుపై ఏపీ సర్కార్ సంచలన ఆదేశాలు.. ఆ నిబంధనలు తప్పనిసరి