Telangana: ధరణి సమస్యలకు చెక్ పెడుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం.. దరఖాస్తు తేదీ ఎప్పుడంటే..
ధరణి మార్గదర్శకాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ధరణి సమస్యల పరిష్కారానికి అధికారాలను బదలాయించింది. తహసీల్దార్లు, ఆర్డీవోలు, జిల్లా స్థాయి అధికారులు, సీసీఎల్‌ఏలకు అధికారాలను బదలాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏ స్థాయి అధికారికి ఎలాంటి అధికారాలు ఉంటాయో మార్గదర్శకాల్లో వెల్లడించింది. ధరణిలో సవరింపు కోసం పెండింగ్‌లో 2,45,037 దరఖాస్తులు ఉన్నాయని తెలిపింది ప్రభుత్వం.
ధరణి మార్గదర్శకాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ధరణి సమస్యల పరిష్కారానికి అధికారాలను బదలాయించింది. తహసీల్దార్లు, ఆర్డీవోలు, జిల్లా స్థాయి అధికారులు, సీసీఎల్‌ఏలకు అధికారాలను బదలాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏ స్థాయి అధికారికి ఎలాంటి అధికారాలు ఉంటాయో మార్గదర్శకాల్లో వెల్లడించింది. ధరణిలో సవరింపు కోసం పెండింగ్‌లో 2,45,037 దరఖాస్తులు ఉన్నాయని తెలిపింది ప్రభుత్వం. పట్టాదారు పాసు పుస్తకాల్లో డేటా కరెక్షన్ కోసం ధరణిలో లక్షకు పైగా అప్లికేషన్లు వచ్చాయంటున్నారు అధికారులు. ధరణి సమస్యల పరిష్కార కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. మార్చి 1 నుంచి 9 వరకు రెవెన్యూ ప్రత్యేక డ్రైవ్‌ని నిర్వహించనున్నారు. కలెక్టర్లకు ప్రత్యేక గైడ్లైన్స్ సీసీఎల్ఏ జారీ చేసి సమస్యల పరిష్కరం దిశగా అడుగులు వేయాలని సూచించింది ప్రభుత్వం.
ఫిబ్రవరి 24న ధరణిపై సీఎం చేసిన రివ్యూలో ధరణి సమస్యలపై వచ్చిన అప్లికేషన్లను వెంటనే క్లియర్ చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో అడుగులు వేస్తోంది. సీసీఏఎల్, తహశీల్దార్, ఆర్టీవో, అడిషనల్ కలెక్టర్, కలెక్టర్ల సమక్షంలో కమిటీలు వేసింది. ఒక టైం లైన్ విధించి ఆ లోపల పెండింగ్ అప్లికేషన్లను క్లియర్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కరెక్షన్ చేసిన అప్లికేషన్ల వివరాలను ఎలక్ట్రానిక్స్ రికార్డ్స్‌లో భద్రపరచాలని సూచించింది.
ధరణి అడ్డం పెట్టుకొని ఆక్రమించిన ప్రభుత్వ భూముల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది. ఆధార్ నెంబర్ మిస్ మ్యాచ్, రైతుల పేర్లు తప్పుగా ప్రచురించబడి ఆగిపోయిన అప్లికేషన్స్, ఫోటో మిస్ మ్యాచ్ వంటి పెండింగ్ అప్లికేషన్లను సత్వరమే పరిష్కరించాలని సూచనలతో పాటు అసైన్డ్ల సమస్యలు పరిష్కరించాలని, పాస్ బుక్ కరెక్షన్స్, పాస్ బుక్‌లో మిస్ అయిన పేర్లు సర్వే నెంబర్లపై దృష్టి పెట్టనున్నారు.
ధరణి కమిటీ సచివాలయం వేదికగా పలు సార్లు భేటీ అయ్యి.. వివిధ డిపార్ట్ మెంట్ల నుంచి సమస్యలను అడిగి తెలుసుకుంది. అటవీ ,రెవెన్యూ, రిజిస్ట్రేషన్, దేవాదాయ శాఖ అధికారులతో భేటీ అయ్యింది. వివిధ జిల్లాల కలెక్టర్ల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంది. ఆ ఫీడ్ బ్యాక్ ఆధారంగా తొందరగా చిన్నచిన్న సమస్యల పరిష్కారం ఏమి చేయొచ్చన్న దానిపై ప్రభుత్వానికి సూచనలు చేసింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..