Hyderabad: టాప్ సివిల్స్ కోచింగ్ సెంటర్లలో ప్రారంభమైన కథ.. పోలీస్ స్టేషన్‎లో ఎండ్ కార్డ్..

సివిల్స్‌ పరీక్షల్లో ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ క్లియర్‌ చేశాడు..! ఇంటర్వూలో బోల్తాకొట్టి ఒక్క అడుగులో ఉద్యోగానికి దూరమయ్యాడు! సివిల్స్‌ అభ్యర్థులకు కోచింగ్‌ కూడా ఇస్తున్నాడు. రాజు గుర్రం గాడిద అయినట్టు.. ఇతగాడి బుద్ది గడ్డి తినింది. ఆన్‌లైన్‌ గేమ్స్‌, బెట్టింగ్‌‎కు అడిక్ట్ అయ్యాడు. లక్షలు కోల్పోయాడు. రాంగ్‌ రూట్‌లో డబ్బులు సంపాధించే ప్లాన్‌ వేశాడు. మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాల పేరుతో అయాయకులను బురీడి కొట్టించి డబ్బులు దండుకుంటున్నాడు.

Hyderabad: టాప్ సివిల్స్ కోచింగ్ సెంటర్లలో ప్రారంభమైన కథ.. పోలీస్ స్టేషన్‎లో ఎండ్ కార్డ్..
Cyber Crime
Follow us

| Edited By: Srikar T

Updated on: Mar 01, 2024 | 3:39 PM

సివిల్స్‌ పరీక్షల్లో ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ క్లియర్‌ చేశాడు..! ఇంటర్వూలో బోల్తాకొట్టి ఒక్క అడుగులో ఉద్యోగానికి దూరమయ్యాడు! సివిల్స్‌ అభ్యర్థులకు కోచింగ్‌ కూడా ఇస్తున్నాడు. రాజు గుర్రం గాడిద అయినట్టు.. ఇతగాడి బుద్ది గడ్డి తినింది. ఆన్‌లైన్‌ గేమ్స్‌, బెట్టింగ్‌‎కు అడిక్ట్ అయ్యాడు. లక్షలు కోల్పోయాడు. రాంగ్‌ రూట్‌లో డబ్బులు సంపాధించే ప్లాన్‌ వేశాడు. మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాల పేరుతో అయాయకులను బురీడి కొట్టించి డబ్బులు దండుకుంటున్నాడు. సివిల్స్‌ ఆస్పిరెంట్‌.. కేటుగాడిలా ఎందుకు మారాడు.?

హైదరాబాద్‌‎లో ఈ మోసగాడిని పట్టుకున్నారు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు. మల్టీ నేషనల్‌ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని.. అమాయకుల నుంచి లక్షల రూపాయలు దండుకున్నాడు. మోసం చేసినవాడు సాధారణ వ్యక్తేం కాదు. సివిల్స్‌ పరీక్షల్లో ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ క్లియర్‌ చేశాడు. ఇంటర్వూ రౌండ్‌లో బోల్తాకొట్టి ఉద్యోగానికి కోల్పోయాడు. ఆ తర్వాత టాప్‌ కోచింగ్‌ సెంటర్లలో సివిల్స్‌ అభ్యర్థులకు కోచింగ్‌ కూడా ఇస్తున్నాడు. ఇలాంటి వ్యక్తి మోసాగాడిలా మారాడు. బాచుపల్లికి చెందిన సీతయ్య సొంతూరు విజయవాడ. కానీ కొన్నేళ్లుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు. ఇంటర్వూ రౌండ్‌లో దెబ్బకొట్టి ఉద్యోగానికి దూరమయ్యాడు. హైలీ ట్యాలెంటెడ్‌ పర్సన్‌. సివిల్స్‌కి కోచింగ్‌ ఇస్తున్న టాప్‌ సెంటర్లలో సీతయ్య క్లాసులు కూడా చెప్తున్నాడు. అంతా బాగానే ఉంది. ఇదంతా సీతయ్యకు ఒకవైపే. సీతయ్యలో మరో కోణం కూడా ఉంది. ఉద్యోగానికి ఒక్క అడుగులో దూరమవడంతో.. తట్టుకోలేకపోయాడు. అదే సమయంలో కుటుంబ కారణాల వల్ల సీతయ్య భార్య విడాకులు తీసుకుని దూరంగా ఉంటోంది. దీంతో.. డిప్రెషన్‌కు లోనయ్యాడు. ఆన్‌లైన్‌ గేమ్స్‌, బెట్టింగ్‌కు అడిక్ట్‌ అయ్యాడు. లక్షల రూపాయలు తగలేశాడు. రెండేళ్లుగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతూ డబ్బులు పోగొట్టుకుంటూనే ఉన్నాడు.

కోచింగ్‌ సెంటర్ల ద్వారా వస్తున్న జీతం తన వ్యసనాలకు ఏమాత్రం సరిపోవడం లేదు. దీనికి తోడు అప్పులు కూడా ఎక్కువయ్యాయి. సీతయ్య బుద్ధి గడ్డితినింది. వక్రమార్గంలో డబ్బులు సంపాధించాలనుకున్నాడు. అమాయకులను టార్గెట్‌ చేసి.. డబ్బులు కొల్లగొట్టాలనుకున్నాడు. ఉద్యోగాల పేరుతో చీట్‌ చేసి డబ్బులు కాజేయాలని ప్లాన్‌ చేశాడు. కార్‌పుల్లింగ్‌‎లో పరిచయమైన గౌతమ్‌ కుమార్‌ను టార్గెట్‌ చేశాడు సీతయ్య. తాను ఎరిక్సన్‌ గ్లోబల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో టాప్‌ పొజిషన్‌లో పనిచేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. తమ కంపెనీలో ఇంకా ఉద్యోగాలు ఉన్నాయని.. రిక్రూట్‌మెంట్‌ జరుగుతోందని గౌతమ్‌‎కి చెప్పాడు సీతయ్య. దీంతో గౌతమ్‌.. తనకు ఉద్యోగం ఇప్పించేలా చూడమని కోరాడు. తన పూర్తి వివరాలు మెయిల్‌ చేయమని.. అయితే డబ్బు ఖర్చు అవుతుందని చెప్పాడు సీతయ్య. గౌతమ్‌ ద్వారా 2 లక్షల 50 వేల రూపాయలు తీసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత గౌతమ్‌కు ఓ ఫేక్‌ అపాయింట్‌మెంట్‌ లెటర్‌ మెయిల్‌ చేశాడు సీతయ్య.

ఇవి కూడా చదవండి

గౌతమ్‌కు ఎరిక్సన్‌ గ్లోబల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ అనలిస్ట్‌గా ఉద్యోగం వచ్చినట్లు ఆఫర్‌ లెటర్‌ క్రియేట్‌ చేసి మెయిల్‌ చేశాడు. తనకు నిజంగానే ఉద్యోగం వచ్చిందనుకుని ఎరిక్సన్‌ కంపెనీకి ఆఫర్‌ లెటర్‌తో వెళ్లాడు గౌతమ్‌. అది ఫేక్‌ లెటర్‌ అని.. మా కంపెనీలో అలాంటి ఉద్యోగాలే లేవని చెప్పింది ఎరిక్సన్‌ కంపెనీ. దీంతో షాక్‌‎కి గురయ్యాడు గౌతమ్‌. సీతయ్య చేతిలో నిండామునిగానని అర్థం చేసుకున్నాడు. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గౌతమ్‌ ఫిర్యాదుతో సీతయ్యను పట్టుకున్న పోలీసులు.. కూపీ లాగారు. ఉద్యోగాల పేరుతో గౌతమ్‌ను మాత్రమే కాదు పలువురిని మోసం చేసినట్లు గుర్తించారు పోలీసులు. సీతయ్య అప్పటికే ఆరు కేసుల్లో ఉన్నాడు. నిరుద్యోగులను టార్గెట్‌ చేసి.. ఉద్యోగాలు ఇప్పిస్తానని సీతయ్య మోసం చేస్తుంటాడని విచారణలో తేలిందన్నారు సైబర్‌ క్రైమ్‌ డీసీపీ. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ క్లియర్‌ చేసినా.. ఉద్యోగం రాకపోవడం.. భార్య వదిలి వెళ్లటంతో సీతయ్య డిప్రెషన్‌కు లోనయ్యాడని దీనికితోడు ఆన్‌లైన్‌గేమింగ్‌, బెట్టింగ్‌ వంటి వ్యసనాల కారణంగా సీతయ్య మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…