KTR: మేడిగడ్డను కూల్చాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోంది.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
కాంగ్రెస్‌కి కౌంటర్‌గా చలో మేడిగడ్డ చేపట్టింది బీఆర్‌ఎస్. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ నుంచి మేడిగడ్డకు బయల్దేరి వెళ్లింది బీఆర్‌ఎస్ బృందం. కేటీఆర్, హరీష్‌తోపాటు రెండు వందల మందికి పైగా ముఖ్యనేతలు, ఇరిగేషన్ నిపుణులు ఈ టీమ్‌లో ఉన్నారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలించనున్న బీఆర్‌ఎస్ బృందం.. అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. నిజాలను నిగ్గుతేల్చి.. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే తమ లక్ష్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్‌కి కౌంటర్‌గా చలో మేడిగడ్డ చేపట్టింది బీఆర్‌ఎస్. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ నుంచి మేడిగడ్డకు బయల్దేరి వెళ్లింది బీఆర్‌ఎస్ బృందం. కేటీఆర్, హరీష్‌తోపాటు రెండు వందల మందికి పైగా ముఖ్యనేతలు, ఇరిగేషన్ నిపుణులు ఈ టీమ్‌లో ఉన్నారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలించనున్న బీఆర్‌ఎస్ బృందం.. అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. నిజాలను నిగ్గుతేల్చి.. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే తమ లక్ష్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మేడిగడ్డ పర్యటనకు ముందు కేటీఆర్ తెలంగాణ భవన్ దగ్గర మాట్లాడారు. మేడిగడ్డను కూల్చాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందంటూ పేర్కొన్నారు. రిపేర్లు చేస్తే సరిపోయేదానికి ఇంత రాద్ధాంతం ఎందుకు? వర్షాకాలంలో ప్రాజెక్ట్ కొట్టుకుపోవాలని కాంగ్రెస్ అనుకుంటుందా? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే రిపేర్లు మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బాధ్యత మరచి రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. వాస్తవాలు చెప్పడానికే మా ఈ చలో మెడిగడ్డ పర్యటన అన్న కేటీఆర్.. రైతు ప్రయోజనం ముఖ్యం కాదు రాజకీయ ప్రయోజనం కాంగ్రెస్ పార్టీకి కావాలంటూ ఫైర్ అయ్యారు. ఇవ్వాల చేస్తున్న మొదటి పర్యటన తర్వాత అన్ని ప్రాజెక్టు లు పర్యటిస్తామన్నారు. రిపేర్ చేయడానికి ఇబ్బంది ఏంటని.. భాద్యుల పై చర్యలు తీసుకోవాలని.. రైతులను బలి చేయొద్దంటూ కోరారు.
లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలి..
మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతి గొప్ప లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అని పేర్కొన్నారు. 5 వందలు 6 వందలు మీటర్ల లోతునుంచి నీళ్లను లిఫ్ట్ చేసే గొప్ప పథకం అని.. ప్రాజెక్టులు పూర్తి చేసి వలసలు ఆపినట్లు తెలిపారు. 86 పిలర్ల లో 3 పిలర్లు కుంగాయని.. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టు లో కూడా సంకేతిక లోపాలు ఉంటాయి సరిదిద్దుకోవాలంటూ కోరారు. కాళేశ్వరం లో మొత్తం196 స్కీంలు.. ఉన్నాయి మూడు పిలర్లు కుంగితే భూతద్దంలో పెట్టి చూస్తున్నారన్నారు. కల్వకుర్తి ప్రాజెక్టు అసంపూర్తిగా ఉన్నా తామెన్నడు బ్లేమ్ చేయలేదన్నారు. కడియం ప్రాజెక్టు రెండు మార్లు తెగిందని.. అలా అని ఇప్పుడు మెడిగడ్డ కేవలం కుంగింది.. తెగలేదంటూ వివరించారు. రాజకీయాల కోసం రాజకీయ పబ్బం గడపడానికి రైతులను ఫణంగా పెట్టొద్దన్నారు. వచ్చే వర్ష కాలం కల్లా సుందిళ్ళ, అన్నారం, ఎల్లంపల్లి, కొండపోచమ్మ, మల్లన్న సాగర్లో నీటిని నింపాలంటూ డిమాండ్ చేశారు. గతం లో 40 ఏండ్లు అయినా ఒక్కో దగ్గర ప్రాజెక్టులు పూర్తి కాలేదు.. కానీ తాము కాళేశ్వరం మూడు ఏండ్లలో పూర్తి చేసినట్లు తెలిపారు. రైతు బంధు గతి లేదు ఇప్పటికి మూడు సార్లు పెండింగ్ లో పెట్టారంటూ కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..