Lasya Nanditha Accident Case: ఎమ్మెల్యే లాస్య యాక్సిడెంట్ కేసులో కీలక పరిణామం.. టిప్పర్ లారీ సీజ్..

Lasya Nanditha Car Accident Case: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో ఫిబ్రవరి 23న మరణించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఎమ్మెల్యే లాస్య యాక్సిడెంట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. లాస్య కారును ఢీ కొట్టిన లారీని పోలీసులు కొనుగొన్నారు. టిప్పర్‌ను ఢీ కొట్టడం వల్లే లాస్య మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.

Lasya Nanditha Accident Case: ఎమ్మెల్యే లాస్య యాక్సిడెంట్ కేసులో కీలక పరిణామం.. టిప్పర్ లారీ సీజ్..
Lasya Nanditha
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 01, 2024 | 11:09 AM

Lasya Nanditha Car Accident Case: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో ఫిబ్రవరి 23న మరణించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఎమ్మెల్యే లాస్య యాక్సిడెంట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. లాస్య కారును ఢీ కొట్టిన లారీని పోలీసులు కొనుగొన్నారు. టిప్పర్‌ను ఢీ కొట్టడం వల్లే లాస్య మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. టిప్పర్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. సీజ్ చేశారు. లాస్య నందిత మృతి  ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. లారీకి సంబంధించిన వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలాఉంటే.. ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంపై ఆమె సోదరి నివేదిత ఫిర్యాదుతో పటాన్‌చెరు పీఎస్‌లో పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.. ఐపీసీ సెక్షన్‌ 304 ఏ కింద నందిత పీఏ ఆకాష్‌పై కేసు నమోదైంది.. ఉదయం 5గంటల 15 గంటలకు ఆకాష్‌ ఫోన్‌ చేశాడని, ప్రమాదం జరిగి.. ఇద్దరికీ దెబ్బలు తగిలాయని లొకేషన్‌ షేర్‌ చేశాడని కంప్లైంట్‌ చేశారు. తాము వెళ్లి చూసేసరికి స్పాట్‌లో నుజ్జునుజ్జు అయి కారు మాత్రమే ఉందని చెప్పారు. లాస్య సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆకాష్ ను కూడా విచారిస్తున్నారు.

కాగా.. అంతకుముందు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివపేటలోని ఓ దర్గాలో మొక్కులు చెల్లించడానికి ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యులతో వెళ్లారు. అక్కడి నుంచి తిరిగొచ్చి.. కుటుంబ సభ్యులను ఇంటి దగ్గర దింపిన తర్వాత.. టిఫిన్ కోసం సంగారెడ్డికి వెల్దామని బయటికి వచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పార. అయితే.. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పలు కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు.. తాజాగా.. లారీని సీజ్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను కూడా పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!