KTR: పోలీసుల తీరుపై కేటీఆర్ ఫైర్.. కారణమిదే!

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పోలీసుల తీరుపై మండిపడ్డారు. పరకాలలో జై తెలంగాణ అన్నందుకు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసుల తీరుపైన ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పరకాల ఘటనలో గాయపడిన పార్టీ కార్యకర్తలను ఇవాళ చలో మేడిగడ్డ కు వెళుతున్న సందర్భంగా కలిసి మాట్లాడారు.

KTR: పోలీసుల తీరుపై కేటీఆర్ ఫైర్.. కారణమిదే!
BRS Working president KTR
Follow us
Balu Jajala

|

Updated on: Mar 01, 2024 | 3:39 PM

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పోలీసుల తీరుపై మండిపడ్డారు. పరకాలలో జై తెలంగాణ అన్నందుకు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసుల తీరుపైన ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పరకాల ఘటనలో గాయపడిన పార్టీ కార్యకర్తలను ఇవాళ చలో మేడిగడ్డ కు వెళుతున్న సందర్భంగా కలిసి వారితో మాట్లాడారు. పోలీసుల వ్యవహరించిన తీరును అడిగి తెలుసుకున్నారు.

బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కఠినంగా వ్యవహరించడంపై కేటీఆర్ సీరియస్ అయ్యారు. వెంటనే జిల్లా పోలీస్ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొంతమంది స్థానిక పోలీసులు అత్యుత్సాహంతో పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని, రేవంత్ ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ ఆవేదన వ్యక్తం చేశారు.

కార్యకర్తలను పోలీసు స్టేషన్లకు పిలిపించి వేధిస్తే బీఆర్ఎస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలకు దిగుతుందని పరోక్షంగా హెచ్చరించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని… పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలని అన్నారు.  కార్యకర్తలు ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని, ఉద్యమంలో ఇలాంటి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడ్డ పార్టీ మనదని గుర్తుచేశారు. స్థానిక పోలీస్ అధికారిని సస్పెండ్ చేసినా, పార్టీ కార్యకర్తలపైన పోలీసుల దమనకాండ ఆగడం లేదని ఈ సందర్భంగా పరకాల నేతలు కేటిఆర్ దృష్టికి తీసుకొచ్చారు. పరకాలలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్షగట్టిన పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలిపారు. ఢిల్లీ వరకు వెళతామని, న్యాయస్థానాలతోపాటు మానవహక్కుల సంఘాలను ఆశ్రయించి వారిపై చర్యలు తీసుకునే వరకూ పోరాటం కొనసాగిస్తామని కేటిఆర్ స్పష్టంచేశారు.