Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Operation Jai: డ్రగ్ కంట్రోల్ ఆపరేషన్ ‘జై’ సక్సెస్.. నకిలీ మందుల గుట్టురట్టు..!

నకిలీ మందుల కేసుకు సంబంధించి ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్‌లోని ఓ ఫార్మాస్యూటికల్‌ కంపెనీపై తెలంగాణ పోలీసులు, డ్రగ్‌ కంట్రోలర్‌ విభాగం అధికారులు దాడి చేశారు. ఈ కేసులో ఫార్మా కంపెనీ యజమానితో సహా సరఫరాదారులను అరెస్టు చేసింది. ఈ ఫ్యాక్టరీలో జంతువులకు నకిలీ కాల్షియం మందులను తయారు చేస్తున్నట్లు పోలీసలు గుర్తించారు. అంతేకాకుండా, మనుషుల కోసం నకిలీ యాంటీబయాటిక్స్ కూడా తయారు చేస్తున్నట్లు తేలింది.

Operation Jai: డ్రగ్ కంట్రోల్ ఆపరేషన్ 'జై' సక్సెస్.. నకిలీ మందుల గుట్టురట్టు..!
Fake Medicines Rocket
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 01, 2024 | 12:54 PM

నకిలీ మందుల కేసుకు సంబంధించి ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్‌లోని ఓ ఫార్మాస్యూటికల్‌ కంపెనీపై తెలంగాణ పోలీసులు, డ్రగ్‌ కంట్రోలర్‌ విభాగం అధికారులు దాడి చేశారు. ఈ కేసులో ఫార్మా కంపెనీ యజమానితో సహా సరఫరాదారులను అరెస్టు చేసింది. ఈ ఫ్యాక్టరీలో జంతువులకు నకిలీ కాల్షియం మందులను తయారు చేస్తున్నట్లు పోలీసలు గుర్తించారు. అంతేకాకుండా, మనుషుల కోసం నకిలీ యాంటీబయాటిక్స్ కూడా తయారు చేస్తున్నట్లు తేలింది.

వాస్తవానికి తెలంగాణలో ఇటీవల పెద్ద ఎత్తున యాంటీబయాటిక్ మందులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో హైదరాబాద్‌లోని మలక్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్‌ 420, 274, 275 కింద కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత ఫిబ్రవరి 28న తెలంగాణ పోలీసుల విజిలెన్స్ అండ్ డ్రగ్ కంట్రోలర్ బృందం కోట్‌ద్వార్‌కు చేరుకుంది. ఫిబ్రవరి 29న, కోట్‌ద్వార్‌లోని సిడ్‌కుల్ సిగడ్డి వద్ద ఉన్న డ్రగ్ ఫ్యాక్టరీపై కోట్‌ద్వార్, కలాల్‌ఘటి ఔట్‌పోస్ట్ పోలీసులతో కలిసి బృందం దాడి చేసింది.

ఈ దాడిలో ఫార్మాస్యూటికల్‌ ఫ్యాక్టరీలో లక్షల రూపాయల విలువైన నకిలీ జంతు మందులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఫ్యాక్టరీ యజమాని ఉత్తరప్రదేశ్‌ బిజ్నోర్‌కు చెందిన విదేశ్ చౌహాన్, రూర్కీకి చెందిన సచిన్ కుమార్‌లను అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు నకిలీ మందులను పంపిస్తున్న ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీపై కేసు నమోదు చేసినట్లు తెలంగాణ నుంచి వచ్చిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్ జె.కిరణ్ కుమార్ తెలిపారు. ఈ ఫ్యాక్టరీలో నకిలీ మందులను డ్రగ్స్ విభాగం బృందం స్వాధీనం చేసుకుంది.

2021 కరోనా కాలంలో కూడా, నకిలీ ఇంజెక్షన్‌లను తయారు చేయడం, విక్రయించడం విషయంలో ఈ కంపెనీ పేరు కూడా వచ్చింది. ఆ తర్వాత ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ విచారణ చేపట్టింది. అప్పటి విచారణలో ఇలాంటివేమీ దొరకలేదు. తాజాగా తెలంగాణ పోలీసులు, డ్రగ్ డిపార్ట్‌మెంట్ దాడుల్లో ఓ పెద్ద విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం తెలంగాణకు చెందిన బృందం నిందితులిద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…