Drug Case: వస్తాను అని చెప్పి పోలీసులకు జలక్ ఇచ్చిన డైరెక్టర్ క్రిష్.. డ్రగ్స్ కేసులో అనుహ్య మలుపు..
రాడిసన్ డ్రగ్స్ కేసులో ఏ10 నిందితుడిగా డైరెక్టర్ క్రిష్ పేరును గచ్చిబౌలీ పోలీసులు చేర్చారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ ఆయనకు నోటీసులు పంపించారు పోలీసులు. అయితే తాను ముంబైలో ఉన్న కారణంగా రాలేకపోతున్నానని.. శుక్రవారం హాజరవుతానని తెలిపారు క్రిష్.
రాడిసన్ డ్రగ్స్ కేసులో ఏ10 నిందితుడిగా డైరెక్టర్ క్రిష్ పేరును గచ్చిబౌలీ పోలీసులు చేర్చారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ ఇప్పటికే ఆయన ఇంటికి నోటీసులు పంపించారు. అయితే తాను ముంబైలో ఉన్న కారణంగా రాలేకపోతున్నానని.. శుక్రవారం హాజరవుతానని తెలిపారు క్రిష్. ఇక ఈరోజు గచ్చిబౌలీ పోలీసు స్టేషన్ కు వెళ్లనున్నారు. అయితే ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న డైరెక్టర్ తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఈ కేసులో అనుమానితులుగా ఉన్న రఘు చరణ్ అట్లూరి, సందీప్ లు కూడా బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. వీరితోపాటు యూట్యూబర్ లిషి, శ్వేత, నీల్ తదితరులు కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్ తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం.
గచ్చిబౌలి డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. పోలీసుల విచారణకు సహకరిస్తానన్నా డైరెక్టర్ క్రిష్ అనూహ్యంగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. తనను ఈ కేసులో పోలీస్స్టే అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ వేశాడు. హెపటేషన్ పై శుక్రవారం తెలంగాణ హైకోర్టు విచారించనుంది.ఎప్పుడు డ్రగ్స్ కేస్ తెర మీదికి వచ్చినా అందులో ఎవరో ఒక సెలబ్రిటీ పేరు వినిపిస్తూనే ఉంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసు నుండి మొదలుపెట్టి తాజా రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు వరకు ప్రతి దాంట్లోనూ సినిమా తారలే నిందితులు… వారే డ్రగ్స్ పార్టీ కస్టమర్లు..వారే పార్టీ కర్త క్రియలు..వారే అసలు సూత్రధారులు…
రెడీ సన్ డ్రగ్స్ కేసు దర్యాప్తు రోజుకు మలుపు తిరుగుతుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారులుగా ఉన్న మీర్జా ను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు.. గచ్చిబౌలి రాడిసన్ హోటల్లో జరిగిన పార్టీకి డ్రక్స్ సప్లై చేసినట్టుగా మీర్జా ను గుర్తించారు పోలీసులు..రాడిసన్ డ్రగ్స్ లో నిందితు ల సంఖ్య 13 కు చేరింది…ఇందులో చాలా మంది ఇండస్ట్రీ తో పరిచయము ఉన్న వ్యక్తులే కావడం విశేషం.. ఈ కేసులో ప్రధాన నిందితుడు వివేకానంద డ్రైవర్ ప్రవీణ్ ద్వారా మీర్జా సరఫరా చేశారు. ఫిబ్రవరిలో ఒకే వారంలో నాలుగు సార్లు రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ జరిగినట్టు పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే ఈ నాలుగు సార్లు పార్టీలో డ్రగ్స్ ను అరేంజ్ చేసింది మీర్జాగా పోలీసులు గుర్తించారు. ఒక్కో గ్రామ్ కోకైయిన్ ను 14000 రూపాయలకు మీర్జా వివేకానంద డ్రైవర్ ప్రవీణ్ కు విక్రయించాడు. ప్రవీణ్ ద్వారా వివేకానంద కు చేరిన డ్రగ్స్ ను రాడిసన్ హోటల్ లో ఉన్న మిగతా స్నేహితులకు అందించాడు… రెడీసన్ హోటల్లో ఉన్న రెండు రూములలో పార్టీ జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు.
మరోవైపు పార్టీలో పాల్గొన్న డైరెక్టర్ క్రిష్ వ్యవహారంపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు… ఇప్పటికే పార్టీలో పాల్గొన్నందుకు డైరెక్టర్ క్రిష్ కు 160 crpc కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులు జారీ చేసెందుకు వెళ్లిన సమయంలో క్రిష్ ఇంట్లో లేకపోతే తన కుటుంబ సభ్యుల ఫోన్ ద్వారా పోలీసులు సమాచారం అందించారు. అయితే పోలీసులకు విచారణకు హాజరయ్యేందుకు తనకు కొంత సమయం కావాలని క్రిష్ పోలీసులను విన్నవించుకున్నాడు. తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలలో కోర్టుకు గచ్చిబౌలి పోలీసులు రిమాండ్ రిపోర్టును సబ్మిట్ చేశారు. రిమాండ్ రిపోర్టులో క్రిష్ ఇంకా పరారీ లోనే ఉన్నట్టు గచ్చిబౌలి పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే పోలీసుల ఎదుట శుక్రవారం లేదా సోమవారం హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది.
మరోవైపు ఈ కేసులో నిందితురాలుగా ఉన్న లిశి సోదరి సుసిత గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించింది.. ఎఫ్ఐఆర్ లో లిషి పేరు వచ్చినప్పటినుండి తన అక్క ఇంటికి రాలేదని గచ్చిబౌలి పోలీసులను ఆమె సోదరీ కుషిత ఆశ్రయించింది. పోలీసులు నోటీసులు ఇవ్వడంతో తన సోదరి భయపడి ఇంటికి రాకుండా ఉందని అందుకోసమే పోలీసుల నోటీసులకి వివరణ ఇవ్వలేకపోయిందని ఆమె సోదరీ గచ్చిబౌలి పోలీసులకు వివరించింది..
అయితే ఎప్పుడు డ్రగ్స్ కేసు తెరమీదకి వచ్చిన అందులో సినీ తారల పేర్లు కచ్చితంగా కనిపిస్తూనే ఉన్నాయి. 2017 టాలీవుడ్ డ్రగ్స్ కేసు నుండి తాజా రాడిసన్ డ్రగ్స్ కేసు వరకు ప్రతి దాంట్లో సినీ ప్రముఖులు ప్రత్యక్షమయ్యారు. తాజాగా జరిగిన కొన్ని ఉదాంతాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుల నుండి మొదలుకొని సినీ హీరోలు డైరెక్టర్ల వరకు అందరి బాగోతాలు డ్రగ్స్ పార్టీతోనే ముడిపడి ఉన్నాయి. గతంలో డైరెక్టర్ ఏపీ చౌదరిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేయగా అందులో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టుల పేరు బయటకు వచ్చాయి. గతంలో బంజారాహిల్స్ లోని రాడిసన్ పుడ్డింగ్ అండ్ మింక్ పబ్బులో దాదాపు పదుల సంఖ్యలో సెలబ్రిటీలు ఆ పార్టీలో ప్రత్యక్షమయ్యారు. కొద్ది రోజుల క్రితం నార్సింగ్ పోలీసులు యూట్యూబ్ లావణ్యను అదుపులోకి తీసుకున్నారు. గత పది రోజుల క్రితం నార్సింగ్ పోలీసులు యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ను గంజాయి కేసులో అదుపులోకి తీసుకున్నారు. సాయి తాజాగా గచ్చిబౌలి పోలీసులు రెడిసన్ హోటల్లో రైడ్ నిర్వహించిన తరుణంలో సినీ సెలబ్రిటీలతో పాటు బిజినెస్ మాగ్నెట్లు యూట్యూబర్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఈ పార్టీలో పాల్గొన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో డ్రగ్స్ తీసుకున్న కన్జ్యూమర్లను బాధితులుగా పరిగణించాలని గత రాజకీయ నేతలు చెప్పడంతో పోలీసులు వీరిపై పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇటీవల కాలంలో తరచూ సినీ తారల పేర్లు వినిపిస్తుండటంతో డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపాలనీ సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎక్కడ సెలబ్రిటీ లు డ్రగ్స్ పార్టీలో దొరికిన పోలీసులు వదిలిపెట్టడం లేదు. వారికి నోటీసులు జారీ చేయడంతో పాటు వారి శాంపిల్స్ ను పరీక్షించి ల్యాబ్ కు పంపిస్తున్నారు. ఒకవేళ పాజిటివ్ గా తేలితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నారు.
పార్టీ ఏదైనా సరే, అందులో తారలు మాత్రం మెరుస్తునే ఉంటారు..డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తున్న తారలు కొందరైతే డ్రగ్స్ కు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటూ దారి తప్పుతునరు మరికొందరు తారలు.. ఎది ఏమైనా డ్రగ్స్ గుట్టులో చిక్కుకుంటున్న తారలకు ఇక చుక్కలు తప్పవు అంటున్నారు పోలీసులు.