Hyderabad: డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించడం లేదా.. అయితే తప్పకుండా తెలుసుకోండి..

మేము హెల్మెట్ ధరిస్తున్నాం, మీరు తప్పకుండ ధరించండి. హెల్మెట్ వస్తువు కాదు ప్రాణాన్ని కాపాడే ఆయుధం. ట్రాఫిక్ సిబ్బందికి, వారి పిల్లలకు హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ చేశారు డిప్యూటీ కమిషనర్ ఎల్. సుబ్బారాయుడు. హైదరాబాద్‎లో ఫిబ్రవరి 29న ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, బేగంపేట & నార్త్ జోన్ ట్రాఫిక్, సిబ్బంది ట్రాఫిక్ రూల్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. సికింద్రాబాద్ పీ.జీ. కాలేజ్ ఆడిటోరియం దీనికి వేదికైంది.

Hyderabad: డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించడం లేదా.. అయితే తప్పకుండా తెలుసుకోండి..
Hyderabad Traffic Police
Follow us

|

Updated on: Mar 01, 2024 | 2:45 PM

మేము హెల్మెట్ ధరిస్తున్నాం, మీరు తప్పకుండ ధరించండి. హెల్మెట్ వస్తువు కాదు ప్రాణాన్ని కాపాడే ఆయుధం. ట్రాఫిక్ సిబ్బందికి, వారి పిల్లలకు హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ చేశారు డిప్యూటీ కమిషనర్ ఎల్. సుబ్బారాయుడు. హైదరాబాద్‎లో ఫిబ్రవరి 29న ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, బేగంపేట & నార్త్ జోన్ ట్రాఫిక్, సిబ్బంది ట్రాఫిక్ రూల్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. సికింద్రాబాద్ పీ.జీ. కాలేజ్ ఆడిటోరియం దీనికి వేదికైంది. ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది.. వారి పిల్లలకు ఉచితంగా హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ చేసారు అసిస్టెంట్ కమీషనర్ జి. శంకర్ రాజు. రోడ్డు ప్రమాదాలు, నివారణ పేరుతో ప్రత్యేక కార్యక్రమం రూపొందించారు. దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ కమిషనర్ ఎల్. సుబ్బారాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువగా యువత ఓవర్ స్పీడ్ , రాంగ్ రూట్ , సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరు వాహనం నడిపేటప్పుడు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలి అని చెప్పారు. మోటార్ వాహనాల చట్టం ప్రకారము రైడర్, పైయిలాన్ రైడర్ తప్పనిసరి హెల్మెట్ ధరించాలి అని చెప్పారు. చిన్నపిల్లలు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. వాహనం ముందు కూర్చున్న వ్యక్తి ప్రాణాలు ఎంత ముఖ్యమో వెనుక కూర్చున్న వ్యక్తి ప్రాణాలు కూడా అంతే ముఖ్యం అని పేర్కొన్నారు.

హెల్మెట్ మీ ప్రాణాలను కాపాడే ఆయుధం. సెల్ ఫోన్ పగలకుండ స్క్రీన్ గార్డ్, పౌచ్‎లు వేయిస్తాం కానీ బైక్ నడిపేటప్పుడు మాత్రం తల పగలకుండ హెల్మెట్ ధరించం. సెల్ ఫోన్‎పై ఉన్న జాగ్రత్త, విలువ మన తలకు లేదా అని అన్నారు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపి ఏదైనా ప్రమాదం జరిగితే జీవిత భీమా క్లెయిమ్ కాదు. 2023 నాటికి హైదరాబాద్లో దాదాపు 56.9 లక్షల ద్విచక్ర వాహనాలు ఉన్నాయని, అందులో 18 లక్షల మందికి పైగా హెల్మెట్ ధరించలేదని తెలిపారు. హెల్మెట్ లేని ప్రయాణం నేరం. ద్విచక్ర వాహనంపై ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ. 1,200 వరకు జరిమానా విధిస్తారన్నారు. అలాగే మూడు నెలలు లైసెన్స్ రద్దవుతుందన్నారు. వేగం థ్రిల్ ఇస్తుంది కానీ అది జీవితాన్ని చంపుతుంది. 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు తప్పని సరిగా లైసెన్స్ తీసుకోవాలి అని చెప్పారు. మోటారు వాహన చట్టం ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పబ్లిక్ రోడ్లపై ఎవరూ వాహనం నడపకూడదు. అలా వాహనాలు నడిపినచో 5000 వరకు చలాన్, మూడు నెలల జైలు శిక్ష విధిస్తారని సూచించారు. వాహనాలు నిర్లక్ష్యంగా నడపటం ఎప్పుడు ప్రమాదకరమే అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో సుమారు 200 మంది ట్రాఫిక్ సిబ్బందితోపాటు వారి పిల్లలకు 400 హెల్మెట్స్ ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేశారు డీసీపీ ఎల్. సుబ్బరాయుడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!