AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎన్నికల సిత్రాలు.. ఈ 3 గ్రామాల్లో విచిత్ర పరిస్థితి.. ఎలక్షన్స్ ఉన్నా సర్పంచ్ ఉండడు..

మంచిర్యాల జిల్లాలో పలు గ్రామ పంచాయతీల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. తప్పుడు రిజర్వేషన్ విధానాల కారణంగా సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. గూడెం వంటి పంచాయతీల్లో గిరిజనులు లేకున్నా 38 ఏళ్లుగా ఎస్టీ రిజర్వేషన్ కొనసాగుతోంది. రాజారంలో ఎస్సీలు లేకపోయినా ఎస్సీ రిజర్వేషన్ ఉంది. దీంతో ఎన్నికలు నిలిచిపోయి, స్థానిక అభివృద్ధి కుంటుపడుతోంది.

Telangana: ఎన్నికల సిత్రాలు.. ఈ 3 గ్రామాల్లో విచిత్ర పరిస్థితి.. ఎలక్షన్స్ ఉన్నా సర్పంచ్ ఉండడు..
No Nominations Filed In 3 Villages
Naresh Gollana
| Edited By: |

Updated on: Nov 30, 2025 | 7:53 PM

Share

రాష్ట్రమంతా పంచాయతీ ఎన్నికల నామినేషన్ల జాతర సాగుతుంటే ఆ జిల్లాలోని ఆ పంచాయితీల్లో మాత్రం అలాంటి జోషే కనిపించలేదు. సర్పంచ్‌‌గా నామినేషన్లు దాఖలు చేసేందుకు ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. కారణం ఆ ఊర్లో అసలు ఒక్కరంటే ఒక్కరు కూడా సర్పంచ్ అభ్యర్థిగా అర్హత ఉన్న వారు లేకపోవడమే. అదేంటీ అంటే అంతే.. అంతా పాత కథే. ఓటర్లే లేని రిజర్వేషన్‌ను గ్రామపంచాయితీకి కేటాయించడమే అసలు కారణం.

మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలం గూడెం గ్రామపంచాయితీ జనాభా 2583 అయితే ఓటర్లు 2128. రెండవ అన్నవరం సత్యనారాయణ స్వామి కొలువున్న గ్రామం.. ఈ గ్రామంలో అంతా బీసీ, ఎస్సీ, ఓసీ ప్రజలే. కానీ ఈ గ్రామపంచాయితీని గత 38 ఏళ్ల క్రితం ఎస్టీ రిజర్వ్ పంచాయితీగా నిర్ణయించారు. ఈ గ్రామాన్ని 1987లో ఏజెన్సీ ఏరియాలో చేర్చారు. ఆ రోజు నుండి ఈరోజు వరకు అదే సామాజిక వర్గానికి సర్పంచ్ సీటు రిజర్వ్ చేస్తు వస్తున్నారు. అయితే ఈ గ్రామ పంచాయితీలో ఒక్కరంటే ఒక్కరు కూడా గిరిజనులు లేకపోవడంతో 38 ఏళ్లుగా ఈ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు సాగడం లేదు. ఈ గ్రామంలో 10 వార్డులు ఉండగా.. ఐదు వార్డులు ఎస్టీలకు కెటాయించారు. సర్పంచ్ పదవిని ఎస్టీ మహిళా కు రిజర్వ్ చేశారు. దీంతో అసలు ఒక్కరంటే ఒక్కరు కూడా గిరిజనులు లేకపోవడంతో నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన 5 వార్డులకు సైతం నామినేషన్లు రాలేదు. దీంతో ముచ్చటగా 38 ఏళ్ల తర్వాత కూడా పాత కథే పునరావృతం అయింది. ఇక ఇదే దండెపల్లి మండలంలోని నెల్కి వెంటాపూర్ లోను అలాంటి కథే.

నెల్కి వెంకటాపూర్ జనాభా 2217 కాగా ఓటర్లు 1975.. ఈ పంచాయితీ పరిదిలో 10 వార్డులు ఉండగా ఈ గ్రామాన్ని సైతం ఎస్టీకి రిజర్వ్ చేశారు. 5 వార్డులు ఎస్టీ కి రిజర్వ్ అయ్యాయి. అయితే గతంలో ఇదే గ్రామంలో ఆమ్లేడ్ విలేజ్‌గా ఉన్న వందూర్ గూడ ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామపంచాయితీగా మార్చింది. ఈ గూడాలో జనాభా 613 , ఓటర్లు 216.. వార్డులు 8 కాగా నాలుగు వార్డులు ఎస్టీలకు రిజర్వ్ చేసింది అప్పటి సర్కార్. అయితే వందూరూడ ప్రజలు మాత్రం తమ తండాలో జనాభా లేకున్నా పంచాయతీగా చేశారని, దీని వల్ల అభివృద్ధి కుంటుపడుతోందని తమను నెల్కివెంకటాపూర్ లోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారు. అయితే గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తాజాగా వందూర్ గూడను తాజా సర్కార్ సైతం ఎస్టీ జాబితాలోనే కొనసాగించింది. దీంతో ఈ మూడు పంచాయితీల్లో నామినేషన్లు దాఖలు కాలేదు.

ఇవి కూడా చదవండి

మరో వైపు రెండవ విడతలోను ఈ జిల్లాలో ఇదే సీన్ పునరావృతం అవుతుంది. మంచిర్యాల జిల్లా వేమన్నపల్లి మండలం రాజారం గ్రామంలో ఎస్సీ జనాభా లేనప్పటికీ సర్పంచ్ స్థానాన్ని ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్ చేశారు. ఇక్కడ అత్యధికంగా ఎస్టీ మన్నేవార్, బీసీ జనాభా ఉన్నారు. 2011 జనాభా లెక్కల సమయంలో ఎన్నికల సిబ్బంది మన్నెవార్ ఎస్టీలను మన్నెపోళ్లు (ఎస్సీ)గా నమోదు చేశారు. దీంతో 2019లో సర్పంచ్ తో పాటు సగం వార్డులను ఎస్సీకి కేటాయించారు. తాజాగా కాంగ్రెస్ సర్కార్ కూడా ఎస్టీ జాబితాలోనే చేర్చడంతో ఎన్నికలకు ఒక్కరంటే ఒక్కరు కూడా నామినేషన్ వేసేందుకు సిద్దమవడం లేదు. రాష్ట్రమంతా స్థానిక ఎన్నికల జాతరలో మునిగి తేలుతుంటే ఈ పంచాయితీలు మాత్రం రిజర్వేషన్ల రచ్చతో కొట్టుమిట్టాడుతూనే ఉన్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us