- Telugu News Photo Gallery Fish vs Chicken: Which Protein is Better for Your Health, You Need To Know
చికెన్ Vs చేప.. ప్రోటీన్ దేనిలో ఎక్కువు ఉంటుంది.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
Fish vs Chicken: మాంసాహార ప్రియుల ఆహారంలో సర్వసాధారణంగా ఉండేవి చేప, చికెన్. ఈ రెండూ అద్భుతమైన ప్రోటీన్ మూలాలుగా నిపుణులు చెబుతారు. కానీ వాటి రుచి, ఆకృతి, ఆరోగ్య ప్రయోజనాలలో చాలా తేడాలు ఉన్నాయి. ఆరోగ్యానికి దేనిని ఎంచుకోవాలనే విషయంలో చాలామందికి డౌట్లు ఉంటాయి. ఈ రెండిటి మధ్య గల ప్రధాన తేడాలను, పోషక విలువలను, ఆరోగ్యానికి ఏది బెస్ట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Nov 30, 2025 | 4:37 PM

రుచి - ఆకృతి: చికెన్ నేలపై పెరిగే జంతువు నుండి వస్తే, చేప సముద్రం లేదా నీటిలో నుండి వస్తుంది. చేప మాంసం చాలా మృదువుగా, సులభంగా పొరలుగా విడిపోతుంది. ఇవి తమదైన రుచిని కలిగి ఉంటాయి. ఇది చేపల రకాన్ని బట్టి కొన్నిసార్లు తీపిగా, లేదా తేలికగా, వెన్నగా ఉండవచ్చు. చికెన్ మాంసం కొంచెం గట్టిగా, నమలడానికి వీలుగా ఉంటుంది. చికెన్‌కు చాలా వరకు తటస్థ రుచి ఉంటుంది. కాబట్టి దీనిని మసాలాలు, సాస్‌లు, మెరినేడ్‌లతో అద్భుతంగా తయారు చేయవచ్చు.

పోషక విలువలకు వస్తే.. మీరు ఎక్కువ ప్రోటీన్ కోసం చూస్తున్నట్లయితే, చికెన్ బ్రెస్ట్ ఉత్తమ ఎంపిక. 100 గ్రాముల చికెన్ బ్రెస్ట్ దాదాపు 31 గ్రాముల ప్రోటీన్‌ను అందిస్తుంది. ఇది చాలా రకాల చేపల కంటే ఎక్కువ. మరోవైపు మీరు తక్కువ కేలరీలతో ఎక్కువ ప్రోటీన్ పొందాలనుకుంటే.. వేయించని చికెన్ బ్రెస్ట్ ఉత్తమమైనది. అయితే ఫ్రై చేసినప్పుడు చేప, చికెన్ రెండింటిలోనూ కేలరీలు, కొవ్వు చాలా పెరుగుతాయి.

కేలరీలు - కొవ్వు: సాల్మన్, ట్యూనా వంటి కొన్ని రకాల చేపలలో కేలరీలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. వంట చేసే విధానం కేలరీలను బాగా ప్రభావితం చేస్తుంది. ఫ్రై చేసినప్పుడు చికెన్, చేప రెండింటిలోనూ కేలరీలు, కొవ్వు పరిమాణం గణనీయంగా పెరుగుతాయి.

ఆరోగ్యానికి ఏది బెస్ట్?: మొత్తం ఆరోగ్య ప్రయోజనాల గురించి మాట్లాడినప్పుడు, చేపలు ఖచ్చితంగా మెరుగైనవి. దీనికి ప్రధాన కారణం చేపలలో మన శరీరాలు సొంతంగా తయారు చేయలేని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉండటం. ఈ ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు.. గుండె జబ్బులు, వాపును తగ్గిస్తాయి. ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ట్రైగ్లిజరైడ్‌లను నియంత్రిస్తాయి. మెదడు ఆరోగ్యానికి చాలా మంచివి. అదనంగా చేపలలో విటమిన్ డి, అయోడిన్, సెలీనియం వంటి ముఖ్యమైన పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి.