ఆ నగరాలు అన్నింటి కంటే రిచ్.. బెస్ట్ లైఫ్ కి మారుపేరు..
ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాలు ఉన్నాయి. వీటిలో కొన్ని పర్యాటక రంగంలో బెస్ట్, కొన్ని టెక్నాలజీలో బెస్ట్. అయితే చాల సిటీస్ మంచి జీవన వైవిద్యం కలిగి ఉన్నాయి. అలాగే ప్రపంచంలో సంపన్న నగరాలు కూడా ఉన్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి విద్య, ఉద్యోగంతో పాటు అన్ని అనువైన సౌకర్యాల అందించే నగరాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. వాటిలో టాప్ 5 నగరాలూ ఏంటి.? ఈ స్టోరీలో తెలుసుకుందామా..
Updated on: Nov 30, 2025 | 3:45 PM

న్యూయార్క్ నగరం, USA: యూనిట్ స్టేట్స్ అఫ్ అమెరికాలోని న్యూయార్క్ ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది. ఇది చాలా మంది బిలియనీర్లకు నిలయం. బలమైన ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, టెక్ మార్కెట్‌ను కలిగి ఉంది. ప్రపంచ దేశాల నుంచి చాలామంది ప్రజలు ఇక్కడికి జాబ్స్ చేయడానికి వస్తారు.

టోక్యో, జపాన్: టోక్యో ఆసియాలో బలమైన నగరంగా మిగిలిపోయింది, అనేక ధనిక కుటుంబాలు, కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ పాత సంస్కృతి, కొత్త వ్యాపారం మిశ్రమంగా ఉన్నాయి. జపాన్ ఎప్పుడు టెక్నాలజీలో ప్రపంచదేశాల అన్నింటికంటే ముందే ఉంటుంది.

శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా, USA: సిలికాన్ వ్యాలీతో సహా బే ఏరియా ఇప్పటికీ గూగుల్, ఆపిల్, ఫేస్‌బుక్ వంటి టెక్ దిగ్గజాలకు కేంద్రంగా ఉంది. ఇక్కడ చాలా మంది టెక్, స్టార్టప్‌లలో పనిచేస్తున్నారు. ఈ ప్రాంతం లక్షాధికారులతో నిండి ఉంది.

లండన్, UK: లండన్ ఒక ప్రపంచ ఆర్థిక కేంద్రం. అనేక మంది సంపన్నులకు నిలయం. దీనికి బ్యాంకింగ్, ఫ్యాషన్, రియల్ ఎస్టేట్‌తో బలమైన సంబంధాలు ఉన్నాయి. ఈ నగరం విద్యారంగానికి ప్రసిద్ద చెందింది. భారత్ సహా అనేక దేశాల విద్యార్థులు ఈ సిటీకి చదువుకోవడానికి వెళ్తారు.

సింగపూర్: సింగపూర్ ఆసియాలో ఒక పెద్ద ధన కేంద్రంగా మారింది. దాని తక్కువ పన్నులు, శుభ్రమైన వ్యవస్థ, బలమైన బ్యాంకింగ్ దీనిని ధనవంతులు, వ్యాపారాలకు అనువైనదిగా చేస్తాయి. తక్కువ పన్ను కారణం అనేక దేశాల ప్రజలు ఇక్కడకి పని కోసం వెళ్తుంటారు.




