AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మనుషులు ఎవరైనా ఇలా ప్రవర్తిస్తారా..? పాపం ఆ చిట్టి తల్లి…

జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని షాపూర్‌నగర్‌లో గల పూర్ణిమా స్కూల్‌లో నర్సరీ చదువుతున్న ఓ చిన్నారి పాఠశాల ఆయా చేతిలో తీవ్రంగా హింసకు గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూల్ ఆవరణలో చిన్నారిపై విచక్షణారహితంగా దాడి చేసిన దృశ్యాలను సమీప ఇంటి పై అంతస్తు నుండి ఓ యువకుడు మొబైల్‌లో రికార్డు చేసినట్లు సమాచారం.

Hyderabad: మనుషులు ఎవరైనా ఇలా ప్రవర్తిస్తారా..? పాపం ఆ చిట్టి తల్లి...
Child Assault Case
Ram Naramaneni
|

Updated on: Nov 30, 2025 | 7:16 PM

Share

హైదరాబాద్‌ షాపూర్‌నగర్‌లోని పూర్ణిమా స్కూల్‌లో చాలా దారుణ ఘటన ఒకటి వెలుగుచూసింది. నర్సరీ చదువుతున్న చిన్నారిపై పైశాచికంగా దాడి చేసింది ఆ స్కూల్‌లో పనిచేస్తున్న ఆయా. నిజంగా ఆ వీడియో చూసిన తర్వాత మనుసు చివుక్కుమంది. మనుషులు అనేవాళ్లు ఇలా ప్రవర్తిస్తారా అనిపించింది. చిన్నారిని కింద వేసి కాలుతో తొక్కింది ఆవిడ. నిజంగా శత్రుత్వం ఉన్నవాళ్లు కూడా పాపను ఇలా కొట్టరండి. ఆ పాప తల్లి కూడా అదే స్కూల్లో ఆయాగా పని చేస్తోంది. ఆమె పిల్లలను దించడానికి బస్సులో వెళ్లిన సమయంలో పాపపై ఈ ఆయా దాడికి పాల్పడింది. ఆయా దాడి చేస్తున్న దృశ్యాలను పక్కన బిల్డింగ్ నుంచి ఓ యువకుడు ఫోన్‌లో రికార్డు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. దాడి తర్వాత నుంచి పాప తీవ్ర జ్వరంతో అల్లాడిపోవడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాపం.. ఒరిస్సా నుంచి బతకడానికి సిటీకి వచ్చారు ఆ పాప తల్లిదండ్రులు. విషయం స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తే.. చిన్న ఇష్యూని ఎందుకు సాగదీస్తున్నావ్ అని ప్రశ్నించారట. దీంతో వారు పోలీసులను సంప్రదించారు. ఆయాతో పాటు అంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన ఆ స్కూల్‌పై కూడా చర్యలు తీసుకోవాలని పోలీసువారిని కోరుతున్నాం.

హెచ్చరిక:  బాలికపై దాడి దృశ్యాలు మిమ్మల్ని కలిచివేయవచ్చు.. సున్నిత మనష్కులు చూడవద్దు..

Follow Us