AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అయ్యో పాపం.. చదువు కోసం ప్రాణం తీసుకున్న విద్యార్థిని.. బాలాపూర్‌లో విషాదం..

ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో బాలాపూర్‌లోని ఇఫ్రా ఖానమ్ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఫీజులు, టీసీ ఛార్జీలు చెల్లించలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఈ విషాద ఘటన చదువుల ఆకాంక్షకు ఆర్థిక కష్టాలు అడ్డుకావడంపై చర్చను లేవనెత్తింది.

Telangana: అయ్యో పాపం.. చదువు కోసం ప్రాణం తీసుకున్న విద్యార్థిని.. బాలాపూర్‌లో విషాదం..
Tragedy In Balapur
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Nov 30, 2025 | 5:13 PM

Share

ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని బాలాపూర్‌లో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన ఇర్ఫాన్ ఖాన్ తన కుటుంబంతో కలిసి జీవనోపాధి కోసం ఎర్రకుంట తూర్ కాలనీలో నివసిస్తున్నాడు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న ఇతడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో పెద్ద అమ్మాయి ఇఫ్రా ఖానమ్. గత ఏడాది నాందేడ్‌లో చదువుకుంటూ, ఇంటర్మీడియట్ కోసం హైదరాబాద్‌కు వచ్చింది. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి కుదేలై ఉండటంతో మిగిలిన ఫీజులు, 4 వేల రూపాయల టీసీ ఛార్జ్‌లు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. టీసీ తీసుకురాకపోవడంతో పాటు ఏ కాలేజీలోనూ అడ్మిషన్ పొందలేకపోయిన ఇఫ్రా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు పోలీసులు గుర్తించారు.

చదువుకోవాలనే కోరిక ఉన్నా ఆర్థికంగా అడ్డంకులు ఎదురవడంతో ఇఫ్రా ఖానమ్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఆవేదనతోనే గురువారం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇఫ్రా ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. . చదువు కొనసాగించేందుకు డబ్బులు లేవనే కారణంగానే విద్యార్థిని ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు దర్యాప్తులో గుర్తించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
వైష్ణవి ఎంత కొట్టినా తలుపు తెరవలేదు.. అనుమానమొచ్చి కిటికీలో నుంచి
వైష్ణవి ఎంత కొట్టినా తలుపు తెరవలేదు.. అనుమానమొచ్చి కిటికీలో నుంచి
రూ. 14 కోట్లు వచ్చాయని షికార్లు చేయకమ్మా.. అతడికి ధోనీ హితబోధ
రూ. 14 కోట్లు వచ్చాయని షికార్లు చేయకమ్మా.. అతడికి ధోనీ హితబోధ
పెళ్లిళ్లకు ముందు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగిన బంగారం, వెండి ధర
పెళ్లిళ్లకు ముందు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగిన బంగారం, వెండి ధర
సౌత్ కొరియన్ సింగర్స్‏తో సుకుమార్ కూతురు..
సౌత్ కొరియన్ సింగర్స్‏తో సుకుమార్ కూతురు..
విద్యార్థులకు కూడా క్రెడిట్ కార్డులు.. ఎలా పొందాలో తెలుసుకోండి
విద్యార్థులకు కూడా క్రెడిట్ కార్డులు.. ఎలా పొందాలో తెలుసుకోండి
భార్య దగ్గర దొరికిపోయిన బూమ్రా.. ఆటాడుకుంటున్న నెటిజన్లు
భార్య దగ్గర దొరికిపోయిన బూమ్రా.. ఆటాడుకుంటున్న నెటిజన్లు
ఓటీటీలో దుమ్మురేపుతున్న సాయి పల్లవి సస్పెన్స్ సినిమా..
ఓటీటీలో దుమ్మురేపుతున్న సాయి పల్లవి సస్పెన్స్ సినిమా..
అయ్యో బిడ్డా.. ఈ బాధ ఎవరికీ రావొద్దు.. పుట్టెడు దుఖంలోనూ..
అయ్యో బిడ్డా.. ఈ బాధ ఎవరికీ రావొద్దు.. పుట్టెడు దుఖంలోనూ..
కొత్త క్రెడిట్ కార్డు రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏప్రిల్ 1 నుంచే..
కొత్త క్రెడిట్ కార్డు రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏప్రిల్ 1 నుంచే..
పిల్లలు ఫోన్‌లను వదలట్లేదా.. పేరెంట్స్ ఇవి పాటిస్తే చాలు
పిల్లలు ఫోన్‌లను వదలట్లేదా.. పేరెంట్స్ ఇవి పాటిస్తే చాలు