Monkey Attack: మరో దారుణం.. రెచ్చిపోయిన కోతి.. చిన్నారి వేలు కొరికేసింది..

కుక్కల దాడులే కాదు.. అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న పట్టణాల్లో కోతుల దాడులూ పెరిగిపోయాయి. మహబూబాబాద్‌ జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. చిన్నారులను పొట్టన పెట్టుకుంటున్నాయి.

Monkey Attack: మరో దారుణం.. రెచ్చిపోయిన కోతి.. చిన్నారి వేలు కొరికేసింది..
Monkey Attack
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 23, 2023 | 8:41 AM

కుక్కల దాడులే కాదు.. అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న పట్టణాల్లో కోతుల దాడులూ పెరిగిపోయాయి. మహబూబాబాద్‌ జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. చిన్నారులను పొట్టన పెట్టుకుంటున్నాయి. హైదరాబాద్‌లో పట్టపగలు జరిగిన అత్యంత దారుణఘటన ఇంకా కళ్లముందే తిరుగుతోంది. ఇలాంటి ఘటనలు తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో వెలుగు చూస్తున్నాయి. అలాంటిదే మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఈ దారుణం. కురవి మండలం మోదుగుల గూడెంలో రెండునెలల పాపపై కోతులు దాడి చేశాయి. ఇంటి వరండాలో చిన్నారిని పడుకోబెట్టడంతో.. చుట్టుముట్టిన కోతులు దాడికి దిగాయి. చిన్నారి కాలి బొటన వేలుని బలంగా కొరికాయి.

దీంతో ఆ చిట్టితల్లి అల్లాడిపోయింది. తల్లిదండ్రులు వచ్చి చూసేసరికి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది చిన్నారు. కాలి బొటన వేలు నుంచి రక్తం ధారగా కారడం కనిపించింది. కోతి దాడిలో సగం వేలు కూడా కోల్పోయింది రెండునెలల పాప. శరీరంపై పలుచోట్ల గాయాలు కూడా అయ్యాయి. దీంతో చిన్నారిని ఎత్తుకుని ఆస్పత్రికి పరుగులు తీశారు తల్లిదండ్రులు. చికిత్స కోసం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పసికందు వేలికి ట్రీట్మెంట్‌ చేస్తున్నారు వైద్యులు. మహబూబాబాద్‌ ఏరియాలో కోతుల బెడద భారీగా ఉంది. పట్టపగలు ఇంటి తలుపు తెరిస్తే చాలు.. వచ్చేస్తున్నాయి. కొన్నిసార్లు ఇంట్లో నివశిస్తున్న చిన్నారులు, వృద్ధులు, మహిళలపై దాడులకు కూడా దిగుతున్నాయి.

ఈ కోతుల బెడదల కోసం అధికారులకు ఎన్నోసార్లు విన్నవించుకున్నామంటున్నారు స్థానికులు. చిన్నపాటి చర్యలు తీసుకోవడమే కాని.. కోతులను అడవులకు వాపస్‌ పంపే ప్రక్రియపై పూర్తిస్థాయిలో దృష్టిసారించలేదు. చిన్నారిని కోతులు కరవడంతో మహబూబాబాద్‌ జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తమన చిన్నారులకు బయటకు పంపాలంటేనే వణికిపోతున్నారు తల్లిదండ్రులు. రెండు నెలల పాపకు ఎలాంటి ప్రాణ నష్టం లేదని డాక్టర్లె తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా