AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Election Result 2024: లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం.. అందరి చూపు ఈ నియోజకవర్గాలపైనే

తెలంగాణవ్యాప్తంగా 34 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 120 హాళ్లలో 1855 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. 2.18లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు 19 హాళ్లలో 276 టేబుళ్లు ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 వరకు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. 10వేల మంది సిబ్బంది కౌంటింగ్‌ విధులను నిర్వహించనున్నారు.

Telangana Election Result 2024: లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం.. అందరి చూపు ఈ నియోజకవర్గాలపైనే
Telangana Election Result 2024
Basha Shek
|

Updated on: Jun 04, 2024 | 8:07 AM

Share

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అధికారులు ఓట్ల లెక్కింపును షురూ చేశారు. హోరాహోరీగా సాగిన లోక్ సభ ఎన్నికల ఫలితాలు మరి కొద్ది గంటల్లో వెలువడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 175 స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అలాగే తెలంగాణ  రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల భవితవ్యం మరికొన్ని గంటల్లో వెల్లడి కానుంది. ఇక తెలంగాణవ్యాప్తంగా 34 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 120 హాళ్లలో 1855 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. 2.18లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు 19 హాళ్లలో 276 టేబుళ్లు ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 వరకు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. 10వేల మంది సిబ్బంది కౌంటింగ్‌ విధులను నిర్వహించనున్నారు. మరో 50 శాతం మంది అడిషనల్‌గా అందుబాటులో ఉన్నారు. అంతేకాదు 2వేల 440 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించింది ఈసీ. చొప్పదండి, దేవరకొండ, యాఖుత్‌పురాఅసెంబ్లీ సెగ్మెంట్లలో 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా.. ఆర్మూరు, భద్రాచలం, అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లలో 13 రౌండ్లలో లెక్కింపు చేపడతారు.

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు రోజున పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 6 నుంచి 24 గంటలపాటు 144 సెక్షన్‌ అమలులో ఉండనుంది. పార్లమెంట్‌ ఎన్నికల కౌంటింగ్‌ వేళ విజయోత్సవ ర్యాలీలకు పోలీస్‌శాఖ అనుమతి నిరాకరించింది. పోలీస్‌శాఖ ఆంక్షల నేపథ్యంలో ఎలాంటి ఊరేగింపులు, సభలు, సమావేశాలు నిర్వహించేందుకు అనుమతి లేదు. అలర్లు, హింసాత్మక ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా కౌంటింగ్‌ నిర్వహించాలంటూ అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఈవో వికాస్‌రాజ్. కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ హాల్ మొత్తం సీసీటీవీ మానిటరింగ్ ఉండనుంది. స్ట్రాంగ్ రూమ్‌ నుంచి కౌంటింగ్ హాల్ వరకు సీసీటీవీలో మానిటరింగ్ చేయనున్నారు అధికారులు.

తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాల్లో 625 మంది పోటీలో ఉన్నారు.. దాదాపు అన్ని చోట్ల త్రిముఖ పోరు నెలకొంది.. ముఖ్యంగా హైదరాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ లాంటి స్థానాల్లో తీవ్ర పోటీ నెలకొంది. అంతేకాకుండా.. చేవెళ్ల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ, భువనగిరి, ఆదిలాబాద్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ లాంటి స్థానాల్లో కూడా నెక్ టు నెక్ ఫైట్ నెలకొంది.

ఇవి కూడా చదవండి

ఎన్నికల ఫలితాలు లైవ్ వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..