Telangana: పైనుంచి చూస్తే మామిడికాయల లోడే.. లోపల ఏముందో చూసి బిత్తరపోయిన పోలీసులు
తగ్గేదేలే అంటూ పుష్ప సినిమాలో హీరో పోలీసులే బిత్తరపోయేలా ఎర్రచందనం సరుకును స్మగ్లింగ్ చేస్తుంటాడు ఆ చిత్రంలోని హీరో. ఆ సినిమాలో ఆ పుష్పరాజ్ ఎలా తరలించాడో కానీ.. రియల్ పుష్పరాజులు మాత్రం ఖతర్నాక్ ఐడియాలతో పిచ్చెక్కిస్తున్నారు. తాజాగా....

మాయగాళ్లు.. కేటుగాళ్లు అస్సలు తగ్గడం లేదు. ఎన్నికల తనిఖీలు ఆగిపోవడంతో.. తమ అక్రమ కార్యకలాపాలను మళ్లీ షురూ చేశారు. పుష్ప రేంజ్ ఐడియాలతో దూసుకుపోతున్నారు. రీల్ పుష్పరాజ్‌కి మించి మేం అన్నట్లు ఖతర్నాక్ ఐడియాలతో పోలీసులనే విస్తుపోయేలా చేస్తున్నారు. ఓరెయ్ ఎవర్రా మీరంతా అనేలా.. గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. వీరిలో కొందరుమాత్రమే పోలీసులకు చిక్కుతున్నారు. తాజాగా ఓ ముఠా మామిడికాయల లోడ్ మాటున గంజాయి అక్రమ రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగుచూసింది. ఏపీలోని అల్లూరి జిల్లా డొంకరాయి నుంచి మణుగూరు మీదుగా మామిడి కాయల లోడ్ వాహనం హైదరాబాద్‌కు వెళ్తోంది. దారిలో ఉన్న చెక్ పోస్టులో పోలీసులు అన్ని వాహనాల్లాగే ఈ వాహనాన్ని కూడా చెక్ చేశారు. కానీ.. వాహనంలోని వ్యక్తుల ప్రవర్తనపై అనుమానం రావడంతో.. పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీంతో.. లోపల ఏ క్లాస్ మాల్ బయటపడింది.
మామిడికాయల మాటున ఏకంగా.. 477 కిలోల గంజాయి రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన సరుకు విలువ రూ.1,19,35,000 ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయి తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులు, ఓ కారు, ట్రాలీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేలా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో ఎంతటివారు ఉన్నా వదలొద్దని పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. దీంతో మత్తు పదార్థాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా కేంద్రాలు, పట్టణాలు, ప్రధాన కూడళ్లలో ముమ్మరంగా చెకింగ్స్ చేపడుతూ డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా అడ్డుకట్ట వేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
