Weather Report: తెలంగాణపై రాజస్థాన్‌ ఎఫెక్ట్‌.. ఎండలు మండుతాయి.!

భానుడి భగభగలకు ఉత్తరాది అగ్నిగుండమైంది. ఢిల్లీ, రాజస్థాన్‌లో అత్యధికంగా 50 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. దేశంలో ఐదేళ్ల తర్వాత ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడం హాట్ టాపిక్‌గా మారింది. ఉత్తరాధి ఎఫెక్ట్‌ తెలంగాణపైనా ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. రాజస్థాన్ వైపు నుంచి వచ్చే వేడి గాలుల వల్ల తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదవుతుందని చెబుతున్నారు.

Weather Report: తెలంగాణపై రాజస్థాన్‌ ఎఫెక్ట్‌.. ఎండలు మండుతాయి.!

|

Updated on: Jun 04, 2024 | 10:20 AM

భానుడి భగభగలకు ఉత్తరాది అగ్నిగుండమైంది. ఢిల్లీ, రాజస్థాన్‌లో అత్యధికంగా 50 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. దేశంలో ఐదేళ్ల తర్వాత ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడం హాట్ టాపిక్‌గా మారింది. ఉత్తరాధి ఎఫెక్ట్‌ తెలంగాణపైనా ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. రాజస్థాన్ వైపు నుంచి వచ్చే వేడి గాలుల వల్ల తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదవుతుందని చెబుతున్నారు. ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతుంది. మంచిర్యాల , కొమరం భీమ్ , నిజామాబాద్ జిల్లాలో కూడా అధిక ఉష్ణోగ్రతలు ఉండవచ్చని చెప్పారు. దక్షిణ మధ్య తెలంగాణలో సాధారణ ఉష్ణోగ్రతలు ఉన్నా ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. అయితే జూన్ 5 తరువాత వాతావరణం కొంత చల్లబడవచ్చని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు.

గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జూన్ రెండు వరకు అధిక ఉష్ణోగ్రత నమోదు అయ్యే అవకాశం ఉందంటున్నారు అధికారులు. రుతు పవనాలు కేరళను తాకిన వారం రోజుల తర్వాత తెలంగాణలోకి ప్రవేశిస్తాయి. జూన్ 5 నుండి 10వ తేదీల్లో రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశిస్తాయి. జూన్ లో వర్షపాతం సాధారణంగా నమోదు అవుతుంది. జులై ఆగస్టులో అధిక వర్షపాతం నమోదయ్య అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us