Driving Licence: ఆర్టీవోకు వెళ్లకుండానే డ్రైవింగ్‌ లైసెన్స్‌ జూన్‌ నుంచి కొత్త రూల్‌..

డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం ఆర్టీవో ఆఫీసుకు పరుగులు పెడుతున్నారా? ఆగండాగండి.. అటువంటి అవసరం లేదంటోంది కేంద్ర ప్రభుత్వం. ఆర్టీవో ఆఫీసు చుట్టూ తిరగకుండానే ఇక నుంచి తేలికగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందేందుకు కొత్త రూల్స్‌ తీసుకొచ్చింది. జూన్‌ 1 నుంచి ఈ నిబంధన అమలులోకి రానుంది. సాధారణంగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే పెద్ద తతంగమే ఉంటుంది. ఆర్టీఓ కార్యాలయం చుట్టూ తిరగాలి.

Driving Licence: ఆర్టీవోకు వెళ్లకుండానే డ్రైవింగ్‌ లైసెన్స్‌ జూన్‌ నుంచి కొత్త రూల్‌..

|

Updated on: Jun 04, 2024 | 10:05 AM

డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం ఆర్టీవో ఆఫీసుకు పరుగులు పెడుతున్నారా? ఆగండాగండి.. అటువంటి అవసరం లేదంటోంది కేంద్ర ప్రభుత్వం. ఆర్టీవో ఆఫీసు చుట్టూ తిరగకుండానే ఇక నుంచి తేలికగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందేందుకు కొత్త రూల్స్‌ తీసుకొచ్చింది. జూన్‌ 1 నుంచి ఈ నిబంధన అమలులోకి రానుంది. సాధారణంగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే పెద్ద తతంగమే ఉంటుంది. ఆర్టీఓ కార్యాలయం చుట్టూ తిరగాలి. ముందుగా స్లాట్ బుకింగ్, డ్రైవింగ్ టెస్ట్, బయో మెట్రిక్ ఇలా ఆర్టీఓ ఆఫీసు చుట్టూ నాలుగైదుసార్లు తిరిగితే గానీ డ్రైవింగ్ లైసెన్స్ దొరకని పరిస్తితి. అయితే జూన్ ఒకటో తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఆర్టీఓ ఆఫీస్‌ చుట్టూ తిరగకుండానే ఈజీగా డ్రైవింగ్ లైసెన్స్ అందుకోవచ్చు. ఇక నుంచి ప్రైవేట్ డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్‌లే డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తాయి. ఈ సర్టిఫికెట్ ఆధారంగా డ్రైవింగ్ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకుంటే సులభంగా లభిస్తుంది. అయితే అన్ని రకాల డ్రైవింగ్ సంస్థలకు కేంద్ర రోడ్డు రవాణా సంస్థ ఈ తరహా అనుమతులు ఇవ్వదు. ఫోర్ వీల్ డ్రైవింగ్ టెస్ట్ సంస్థకు మూడెకరాల భూమి ఉండాలి.

నిబంధనలకు అనుగుణంగా డ్రైవింగ్ టెస్టులు నిర్వహించడానికి అన్ని సౌకర్యాలు ఉండాలి. డ్రైవింగ్ శిక్షణ ఇచ్చే వారు కూడా హైస్కూల్ విద్య పూర్తి చేసి ఉండాలి. డ్రైవింగ్‌లో ఐదేండ్ల అనుభవం, బయో మెట్రిక్ టెక్నాలజీపై అవగాహన కలిగి ఉండాలి. లైట్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ నాలుగు వారాలు గానీ, కనీసం 29 గంటల శిక్షణ గానీ ఉండాలి. ఇందులో 21 గంటలు ప్రాక్టికల్, ఎనిమిది గంటలు థియరీ ఉండాలి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆరు వారాలు, 39 గంటల శిక్షణ అవసరం. 31 గంటల పాటు ప్రాక్టికల్, మిగతా ఎనిమిది గంటలు థియరీ ఉంటుంది. ఈ నిబంధనలు పాటించే వారికి మాత్రమే కేంద్ర రోడ్డు రవాణా సంస్థ డ్రైవింగ్ టెస్ట్ సర్టిఫికెట్ జారీచేసే అధికారం కల్పిస్తుంది. ఇలా ప్రైవేట్ డ్రైవింగ్ సంస్థల ద్వారా తీసుకునే డ్రైవింగ్ సర్టిఫికెట్‌తో లైసెన్స్ కోసం దరఖాస్తు చేయాలి. అలా చేస్తే ఎటువంటి ఇతర పరీక్షల్లేకుండానే లైసెన్సు మంజూరు అవుతుంది. అయితే ముందుగా ఆర్టీవో ఆఫీసులో ఎల్ఎల్ఆర్ తీసుకున్న తర్వాత ఈ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!