AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Lok Sabha Result counting: తెలంగాణలో తొలి ట్రెండ్స్ ఇలా.. ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులు వీరే..

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో తోలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు అధికారులు. ఈ ప్రక్రియ దాదాపు అరగంటపాటూ కొనసాగింది. కొన్ని ప్రాంతాల్లో మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తి అయిన తరువాత ఈవీఎంలను లెక్కించనున్నారు కౌంటింగ్ అధికారులు. లోక్ సభ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లలో తొలి ఫలితం విడుదలైంది.

Telangana Lok Sabha Result counting: తెలంగాణలో తొలి ట్రెండ్స్ ఇలా.. ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులు వీరే..
Bjp Congress
Srikar T
|

Updated on: Jun 04, 2024 | 9:18 AM

Share

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఫలితాలు తొలి ట్రెండ్స్ విడుదలయ్యాయి. ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో తోలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు అధికారులు. ఈ ప్రక్రియ దాదాపు అరగంటపాటూ కొనసాగింది. కొన్ని ప్రాంతాల్లో మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తి అయిన తరువాత ఈవీఎంలను లెక్కించనున్నారు కౌంటింగ్ అధికారులు. లోక్ సభ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లలో తొలి ఫలితం విడుదలైంది. పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ పార్టీకి కాస్త ఆధిక్యం తగ్గింది. బీజేపీ స్వల్ప ఆధిక్యం కనిపిస్తోంది. కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ముందంజలో ఉన్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఆదిలాబాద్‌లో బీజేపీ అభ్యర్థి నగేష్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపులో బీజేపీ లీడ్ లో ఉంది. తెలంగాణలోనే కాకుండా దేశంలోనే అత్యంత పెద్ద పార్లమెంట్ నియోజకవర్గంగా పేరున్న మల్కాజ్‌గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎల్ బి నగర్ అసెంబ్లీ సెగ్మెట్ లో మొదటి రౌండ్లో బీజేపీ లీడ్ లో కొనసాగుతోంది. హైదరాబాద్ ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ముందంజలో ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..