Telangana: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్.. నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఈసీ గెజిట్
తెలంగాణలో స్థానిక సంస్థల నోటిఫికేషన్ రద్దైంది. ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. గత నెల 29న ఇచ్చిన ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్‌ను తదుపరి నోటిఫికేషన్ వచ్చే వరకు నిలిపివేస్తున్నట్టు ఈసీ పేర్కొంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈసీ తెలిపింది.

తెలంగాణలో స్థానిక సంస్థల నోటిఫికేషన్ రద్దైంది. ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. గత నెల 29న ఇచ్చిన ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్‌ను తదుపరి నోటిఫికేషన్ వచ్చే వరకు నిలిపివేస్తున్నట్టు ఈసీ పేర్కొంది. ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు ఎన్నికల సంఘం పేర్కొంది.
ఇదిలా ఉండగా రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9 అమలుపై కోర్టు మధ్యంతర స్థాయిలో స్టే విధించింది. జీవో అమలు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే అభ్యంతరాల దాఖలుకు పిటిషనర్లకు రెండు వారాల గడువు ఇచ్చింది. ఇక బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌పై తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు .
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




