‘జీవో నైన్’పై ఇప్పటికైతే ‘నై’..! అభ్యంతరమేంటి? ప్రభుత్వ సమాధానమేంటి?
ఒక్క జీవో... ఎన్నెన్ని ప్రశ్నలు పుట్టించిందో..! ఎన్నెన్ని వాదనలకు కారణమైందో..! అసెంబ్లీలో రిజర్వేషన్ బిల్లు పాస్ అయిందా? ఎప్పుడు పాస్ అయింది? బిల్లు గవర్నర్ దగ్గరే పెండింగ్‌లో ఉందా? ఆ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం అవసరం పడుతుందా? అసలు జీవో నెంబర్-9ని గవర్నర్ పేరు మీదే ఇష్యూ చేశారా? రిజర్వేషన్ల బిల్లు చట్టంగా మారిందా?

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం కోసం 2018లో చేసిన పంచాయతీరాజ్ చట్టంలో చిన్న సవరణ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ‘ స్థానిక సంస్థల్లో 50 శాతం మించకుండా రిజర్వేషన్లు అమలవుతాయి ‘ అనే చిన్న సెన్‌టెన్స్ తీసేసింది. ఆ బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపింది. సరే.. ఆ బిల్లుకు ఆమోదం రాలేదని పిటిషనర్లు, ఆమోదం వచ్చినట్టేనని ప్రభుత్వ న్యాయవాదులు కోర్టులో టెక్నికల్‌గా మాట్లాడారు. దాని గురించి కూడా చెప్పుకుందాం. బట్.. చట్టంలో చేసిన ఆ మార్పుతోనే జీవో నెంబర్-9ని తీసుకొచ్చి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామని ఉత్తర్వులు ఇచ్చి, ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఇప్పుడా జీవోపైనే స్టే వచ్చింది కాబట్టి.. ఇక లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా లేనట్టే..! ఇంతకీ.. జీవో నెంబర్-9పై స్టే ఇవ్వడానికంటే ముందు కోర్టులో ఏం జరిగింది? ఒక్క జీవో… ఎన్నెన్ని ప్రశ్నలు పుట్టించిందో..! ఎన్నెన్ని వాదనలకు కారణమైందో..! అసెంబ్లీలో రిజర్వేషన్ బిల్లు పాస్ అయిందా? ఎప్పుడు పాస్ అయింది? బిల్లు గవర్నర్ దగ్గరే పెండింగ్‌లో ఉందా? ఆ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం అవసరం పడుతుందా? అసలు జీవో నెంబర్-9ని గవర్నర్ పేరు మీదే ఇష్యూ చేశారా? రిజర్వేషన్ల బిల్లు చట్టంగా మారిందా? ఇన్ని ప్రశ్నలు వేసింది హైకోర్టు. వీటన్నింటికీ ప్రభుత్వం నుంచి సమాధానం కూడా వచ్చింది. ప్రొసీజర్ ప్రకారం అయితే.. పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 285-A సవరించినందుకు గానూ.. ఆ బిల్లు గవర్నర్‌కు...




